ఆచార్య ప్లాప్ కి కారణం ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు ఒక సినిమాని అద్భుతంగా తీయాలని అనుకుంటారు కానీ మధ్యలో వాళ్లకు ఎదురైన అడ్డంకులను బట్టి ఆ సినిమా అనేది మారిపోతుంది అలా వెళ్లిన సినిమా డైరెక్టర్ చేతిలోకి తిరిగి రాదు అందువల్ల ఆ డైరెక్టర్ ఫ్లాపులు మూట కట్టుకోవాల్సి వస్తుంది అంటే కొంతమంది డైరెక్టర్ల దగ్గ మంచి టాలెంట్ ఉన్నా కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు ఎదురవడంతో సినిమాలు ప్లాప్ అవుతూ ఉంటాయి.

అయితే ఇండస్ట్రీలో వరుసగా నాలుగు సినిమాలతో మంచి విజయాలను అందుకున్న కొరటాల శివ ( Koratala Shiva )తన ఐదవ సినిమాగా చేసిన ఆచార్య సినిమా( Acharya ) మాత్రం భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది.

ఆ సినిమా ఫ్లాప్ అవడం వెనక చాలా కారణాలు ఉన్నాయి.ఈ సినిమాలో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ మొదట మహేష్ బాబు చేయాల్సింది.

మహేష్ బాబు( Mahesh Babu ) చేయనని చెప్పిన తర్వాత ఆ పాత్ర ని రామ్ చరణ్ చేశాడు.రామ్ చరణ్ లాంటి హీరో చేయడం వలన స్టోరీ అనేది మార్చాల్సి వచ్చింది.

రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు ఏకంగా ఐదు సార్లు వరకు ఆ సినిమాని మార్చడం జరిగింది.ఎందుకంటే రామ్ చరణ్ లాంటి ఒక పాన్ ఇండియా హీరో సినిమాలో ఉన్నాడు అంటే ఆయన ఇమేజ్ కి తగ్గట్టు గా ఆయన పాత్రని చూపించాలి కాబట్టి స్టోరీని మార్చుతూ వచ్చారు అలా ఈ సినిమాలో ఆయన పాత్ర కి రన్ టైం ఎక్కువ ఉండే విధంగా చూస్తూనే చిరంజీవి పాత్రను కూడా హైలెట్ చేస్తూ స్క్రిప్ట్ రాయాలి అయితే మొదటగా కొరటాల శివ రాసిన సినిమా కథ వేరు,ఆ తర్వాత తీసిన కథ వేరు అవడంతో ఆ సినిమా అనేది పాదాఘట్టంలో కలిసిపోయింది.

Advertisement

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీయార్ తో చేస్తున్న దేవర సినిమా ( Devara )తో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలని కొరటాల చూస్తున్నట్టుగా తెలుస్తుంది.అందుకోసమే ఈ సినిమాకు సంబంధించినప్రతి విషయాన్ని కూడా ఆయనే చాలా కేర్ ఫుల్ గా చూసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు