ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రేణుదేశాయ్ ఎవరి గురించి అంటే..?

బద్రి సినిమాతో తెలుగు తెర కి పరిచయం అయిన రేణు దేశాయి( Renu desai ) ఈ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే ఈ సినిమా తర్వాత తను వేరే ఏ సినిమా లో కూడా నటించకుండా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ని పెళ్లి చేసుకొని ఉండిపోయింది.

పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో వచ్చిన జానీ సినిమా( Johnny movie )లో హీరోయిన్ గా చేసింది ఇక అప్పటి నుండి తెలుగులో ఏ సినిమాలో కూడా తను నటించలేదు అనే చెప్పాలి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి దూరం గా ఉంటున్న రేణు దేశాయి సోషల్ మీడియా లో మాత్రం చాలా యక్తివ్ గా ఉంటుంది.అందులోనే తన భావాలని వ్యక్తపరుస్తూ ఉంటోంది.అలాగే తన పిల్లల ఫొటోలు, వీడియోలను షేర్‌ చేస్తుంటుంది.

అలా తాజాగా రేణు షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.మామూలుగానే రేణు దేశాయ్ సోషల్ మీడియా పోస్ట్స్ అప్పుడప్పుడు చర్చకు దారి తీస్తుంటాయి.

పరోక్షంగా ఎవరినో ఉద్దేశించి అంటున్నట్లు ఆమె కామెంట్స్ ఉంటాయి.తాజా పోస్ట్ కూడా అలాగే ఉండటంతో .మరోసారి నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది.

Advertisement

తనను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళను తలచుకుని రేణు దేశాయ్ బాధపడుతున్నట్లుగా ఆ సందేశం ఉంది.మండుటెండలో చల్లని గాలిలా అనుకోకుండా కొందరు మన జీవితంలోకి వస్తారు.వారి చూపులు మీ హృదయాలతో మాట్లాడతాయి.

వారితో మీరు గడిపిన కొద్ది గంటలు జీవితాంతం గుర్తుండిపోతాయి.చెరగని ముద్ర వేస్తాయి.

చాలా ఎడబాట్లు తీరని వేదన మిగుల్చుతాయి.కొందరు మాత్రం మీ బాధలు తొలగించి, ఆనందం నింపిపోతారు అని రేణు దేశాయ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

ఇది చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు అనే చెప్పాలి అయితే ఆమె ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారు అనే దానిమీద కూడా ఇంకా క్లారిటీ లేదు ఏది ఏమైనా కూడా ఆమె పెట్టిన పోస్ట్ కి చాలా మంది ఎమోషనల్ అయిపోతున్నారు.ప్రస్తుతం ఆమె రవితేజ హీరోగా చేస్తున్న రావణాసుర సినిమా లో నటిస్తూ ఉంది అనే చెప్పాలి.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు