మునుగోడు లో  గద్దర్ దెబ్బ తగలబోయేది ఎవరికో.. ? 

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ లు గెలిచేందుకు అన్ని రకాల వ్యూహాలతో సిడ్డంయిపోయాయి.

దీంతో పాటు,  ఇప్పటికే అక్కడ పార్టీకి చెందిన కీలక నేతలందరినీ అన్ని పార్టీలు మోహరించాయి.

నియోజకవర్గ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.ఈ మూడు పార్టీల పోరులలో ఎవరు విజయం సాధిస్తారు ? ఆ పార్టీకి రాబోయే సార్వత్రికి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుందని జనాలు రెపరెండంగా తీసుకుంటారని అంత అంచనా వేస్తుండడంతో,  ప్రధాని పార్టీలన్నీ హడావుడి పడుతూ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే అనూహ్యంగా తెలంగాణలో పెద్దగా ఉనికి లేని కేఏ పాల్ కు చెందిన  ప్రజాశాంతి పార్టీలో విప్లవ నేపథ్యం ఉన్న గద్దర్ చేరారు.

అంతేకాకుండా మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున గద్దర్ పోటీ చేస్తున్నారు.దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎన్నికల ప్రక్రియను తిరస్కరిస్తూ వస్తున్న గద్దర్ ఇప్పుడు మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఎప్పుడు కనిపించే వేషధారణ ను కూడా పూర్తిగా మార్చి వేశారు .అలాగే ఇటీవల జరిగిన బిజెపి నాయకుల సమావేశంలో గద్దర్ కనిపించారు.అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ  పాల్గొన్న బహిరంగ సభలోను గద్దర్ కనిపించారు.

Advertisement

ఆ తరువాత సిఎల్పీ కార్యాలయానికి వెళ్లి కాంగ్రెస్ తెలంగాణ మాజీ అధ్యక్షుడు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు.ఇక ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.

అయితే అది ప్రజాశాంతి పార్టీ నుంచా లేక మరో పార్టీ నుంచి పోటీ చేస్తానా అనేది ఇంకా తేల్చుకోలేదని, తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం కూడా తనను ఆయన పార్టీ తరఫున పోటీ చేయాల్సిందిగా కోరారని చెప్పుకొచ్చారు.కానీ తాజాగా ప్రజాశాంతి పార్టీ తరఫున మునుగోడులో పోటీ చేయాలని గద్దర్ నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

అయితే గద్దర్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడంతో ఆయన ప్రభావం ఏ పార్టీపై ఎక్కువగా కనిపిస్తుంది ? ఏమేరకు ఓట్లను చీల్చుతారు అనేది ఆసక్తికరంగా మారింది. 

మొదటి నుంచి పీపుల్స్ వార్, మావోయిస్టు నేపథ్యం ఉన్న గద్దర్ రాజ్యాంగం బద్దంగా సాగే ఎన్నికల ప్రక్రియను వ్యతిరేకించారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక ఆఫర్లు వచ్చినా ఆయన ఎన్నికలకు దూరంగానే ఉన్నారు.అయితే ప్రస్తుతం ఆ వైఖరిని మార్చుకున్నట్టుగా అర్థమవుతుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

అయితే గద్దర్ ప్రభావం టిఆర్ఎస్ పై ఎక్కువగా ఉంటుందనే విశ్లేషణలు మొదలయ్యాయి.ఇప్పటికే వామపక్ష పార్టీలు టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి.

Advertisement

అయితే ఆ పార్టీ కి మద్దతుగా నిలబడే వారంతా టిఆర్ఎస్ కు ఓటు వేస్తారనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి .వామపక్ష భావజాలం ఉన్న గద్దర్ టీఆర్ఎస్ ఒట్లనే ఎక్కువ చీల్చే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు