డైరెక్టర్ పరుశురాం ఎవ్వరితో సినిమా చేస్తున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మంచి గుర్తింపును సంపాదించుకున్న కొంతమంది దర్శకులు వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో మాత్రం చాలా వరకు వెనుకబడి పోతున్నారు.

ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్లుగా మంచి గుర్తింపును సంపాదించుకొని భారీ సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న కొంతమంది దర్శకులు భారీ సక్సెస్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.

ఇక యువత, సోలో, గీత గోవిందం లాంటి భారీ సక్సెస్ లను అందుకున్న పరుశురామ్( Director Parasuram ) లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం సినిమా చేయడానికి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.మహేష్ బాబు హీరోగా సర్కారు వారి పాట( Sarkaru Vaari Paata ) అనే సినిమా చేశాడు.

ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి చేసిన ఫ్యామిలీ స్టార్( Family Star ) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అందించకపోవడంతో ఒక్కసారిగా ఆయన కెరీర్ అనేది డైలమాలో పడింది.మరి ఇప్పుడు పరశురాం ఎవ్వరితో సినిమా చేయబోతున్నాడు.

ఆయనకి డేట్స్ ఇచ్చే హీరోలు ఎవరు అనే ధోరణిలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా పరుశురాం ఇప్పుడు మీడియం రేంజ్ హీరోతో ఒక సినిమా చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.

Advertisement

మరి దాని కోసమే ఆయన తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈయన మరోసారి రవితేజతో( Ravi Teja ) సినిమా చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.ఇప్పటికే ఆయన రవితేజతో రెండు సినిమాలను చేసి అ రెండింటితో ప్లాపులను మూటగట్టుకున్నాడు.మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

చూడాలి మరి ఈ సినిమాథ్ ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!
Advertisement

తాజా వార్తలు