జ్ఞానము ప్రసాదించే దక్షిణామూర్తి ఎవరు ?

ఆది గురువుగా చెప్పబడ్డ మహేశ్వరుని రూపం దక్షిణామూర్తి.బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం సనక సనందనాదులు సదా శివుని వద్దకు వెళ్ళారు.

ఆ సమయంలో శివుడు గౌరి సమేతుడై దేవ గణాల మధ్యన నాట్యం చేస్తు న్నాడు.ఈ నృత్య గీత వినోదుడైన సంసారి తమకు బ్రహ్మ విద్యలను ఎలా బోధిస్తాడని అనుమానంతో వెనక్కి తిరిగారు.

Who Is Dakshinamurthy An What Is That Story,dakshinamurthy, God, Devotional , Gn

అలా తిరగగానే ఒక క్రింద శివుడు యువ రూపంలో సందేహాలను నివృత్తి చేస్తున్నాడు.ఆయనే దక్షిణామూర్తి.

దక్షిణామూర్తి ద్వారా సనక సనందనాదులు బ్రహ్మజ్ఞానం పొందినట్లు చెప్పబడింది.శివుని యొక్క జ్ఞాన స్వరూపం దక్షిణామూర్తి.

Advertisement

మహా విష్ణువు యొక్క జ్ఞాన రక్షణ అవతారం.శివుడర్దనారీశ్వర తత్త్వం.

అర్థ నారీశ్వతత్త్వం ఒకటి.వామ పార్శ్వం ఒకటి.

దక్షిణ అంటే కుడివైపు.అది పురుష భాగం (పుంభావం) వామమంటే ఎడమ భాగం స్త్రీ రూపం.

ఒకే చైతన్య త్తత్వం స్త్రీ పుం రూపంగా రెండు భాగాలయింది.అందుకే కాళిదాస మహా కవి స్త్రీ పుంసావాత్మభాగౌేతే భిన్నమూర్తేస్సిసృక్షయా అన్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

దక్షిణ-దక్ష అంటే సమర్థమైనది అని లాక్షణికార్థం.స్వతంత్రం అయినది అని అర్థం.

Advertisement

స్వతంత్రము స్వతః ప్రమాణ సిద్ధమైంది జ్ఞానం ఒక్కటే.చైతన్య శక్తి రెండు అక్షులలో దక్షిణాక్షి లోనే విశేషంగా అభివ్యక్తం అవుతుంది.

తత్త్వానికి దక్షిణమైన మూర్తి జ్ఞాన శక్తి అందుకే జ్ఞానశక్త్యవతారాయ దక్షిణా మూర్తయే నమః అంటారు.దక్షిణాభి ముఖంగా వట వృక్షం క్రింద కూర్చున్న మూర్తి దక్షిణా మూర్తి ఆచార్యేంద్రం బ్రహ్మ విద్యను బోధించే ఆచార్య పురుషులందరకీ మూల పురుషుడు.

“మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వమ్" ఆయన మౌన ముద్రతో పరబ్రహ్మ తత్త్వాన్ని బోధిస్తున్నాడు.శివుని జ్ఞాన శక్త్యవతారం దక్షిణామూర్తి.

తాజా వార్తలు