తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమలహాసన్( Kamala Haasan ) చాలా టాలెంటెడ్ హీరో అనే చెప్పాలి.నటుడుగా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.
ఇక తమిళం( Tamil ) లోనే కాకుండా ఆయన నటించిన అన్ని సినిమాలు తెలుగు లో డబ్ అవడం మొదలుపెట్టాయి.ఇక దాంతో తెలుగులో కూడా స్టార్ హీరోగా తన రేంజ్ ని విస్తరించుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కే విశ్వనాథ్( K Vishwanath ) కమలహాసన్ కెరియర్ లో గుర్తుండిపోయే సక్సెస్ లను ఇచ్చాడు అనే చెప్పాలి.
ఇక దాంతో కమలహాసన్ తో చేసిన స్వాతి ముత్యం, సాగర సంగమం, శుభసంకల్పం( Swati Muthyam, Sagara Sangam, Subhasankalpam ) అనే సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.దాంతో కమలహాసన్ క్రేజ్ ఒక్కసారిగా తార స్థాయిలో పెరిగిపోయిందనే చెప్పాలి.ఇక అటు తమిళం లోను, తెలుగులోను సూపర్ సక్సెస్ ని అందుకున్న హీరోగా ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక మొత్తానికైతే తమిళ్ తెలుగు రెండు మార్కెట్లల్లో కూడా తనని ఢీకొట్టే హీరో లేకుండా సినిమాలు తీయడంలో తనకు తానే పోటీగా ఎదిగాడనే చెప్పాలి.ముఖ్యంగా ఆయన నటనలోని వైవిధ్యం ప్రేక్షకులందరికీ బాగా నచ్చేది అదే ఆయనని సక్సెస్ ఫుల్ హీరోగా మార్చిందనే చెప్పాలి.
ఇక తన సమకాలీన హీరోలందరూ మాస్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే తను మాత్రం ఆర్ట్ సినిమాలు( Art films ) చేస్తూ ముందుకు వెళ్లడంతో ఆయనకి ఎక్కడలేని క్రేజ్ అయితే వచ్చింది.ఎక్కడ కూడా మిస్ యూస్ చేసుకోకుండా అదే రూట్లో ముందుకు కదులుతూ స్టార్ హీరోగా సూపర్ సక్సెస్ లు అందుకున్నాడు…ఇక ఇలాంటి సూపర్ సక్సెస్ లను అందుకున్న కమల్ హాసన్ ను బాగా వాడుకొని కే విశ్వనాథ్ ఆర్ట్ సినిమాలు తీసి సక్సెస్ అయ్యాడు…
.