శనివారం ఏ దేవుడికి పూజ చేస్తే మంచిది?

కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్య ఫలితం దక్కుతుందో తెలిస్తే ఖచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలను కుంటుంటారు.

అలాంటి వారికోసమేనన్నట్టు శివ మహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి.

దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది.మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు.

సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక.ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది.

పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.శనివారం అంటేనే కలియుగ దైవం వేంకటేశ్వరుడికి ప్రీతికరం.

Advertisement
Which God Is Worshipped On Saturday , Anjaneyaswami , Devotional, Saturday Speci

అదేవిధంగా శనిదేవతల ఆరాధన ఉత్తమం.తప్పక హనుమాన్ లేదా రుద్ర సంబంధ అంటే శివాలయాలు, వేంకటేశ్వర ఆలయ సందర్శన, ప్రదక్షిణలు సకల దోషాలను పోగొడుతాయి.

శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది.అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు.

ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇవ్వాలి.ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

శని దోష పూజాది కార్యక్రమాలు కూడా చేయవచ్చు.

Which God Is Worshipped On Saturday , Anjaneyaswami , Devotional, Saturday Speci
స‌న్ ట్యాన్‌కు చెక్ పెట్టే అవిసె గింజ‌లు..ఎలా వాడాలంటే?

ఇలా శనివారం ఏ దేవుడికి పూజ చేసినా ముందుగా సంతోషపడేవాడు శివుడేనని శివపురాణం వివరిస్తోంది.ఈ వారానికి సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావిస్తాడని ప్రతీక.ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు.

Advertisement

సృష్టికి ఆదిలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండింటినీ శివుడు కల్పించాడు.పాపం చేయటం లేదా పుణ్యం చేయట మనేది మానవుల పూర్వ జన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది.

చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి.ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి.

ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన.

తాజా వార్తలు