మాంచి డిమాండ్ ఉన్న రంగంలో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ చెల్లి..

దీప వెంకట్. ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.

కానీ హీరో ఉదయ్ కిరణ్ చెల్లి అని చెప్తే టక్కున గుర్తు పడతారు.

తన అన్నతో కలిసి పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా కొత్త అవతారం ఎత్తింది.

తెలుగులో బాగా డిమాండ్ ఉన్న రంగంలోకి అడుగు పెట్టింది.తెలుగు సినిమా పరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్టులకు చాలా కొరతతో పాటు డిమాండ్ ఉంది.

రోజా రమణి, సరిత, సింగర్ సునీత ఇలా చాలామంది స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పారు.అలాగే హీరోలకు కూడా ఎస్పీ బాలు, మనో, సాయికుమార్, ఘంటసాల రత్న కుమార్, హేమచంద్ర వంటి వాళ్ళు డబ్బింగ్ చెప్పారు.

Advertisement
Whereabouts Of Hero Uday Kiran Sister Deepa Venkat, Deepa Venkat, Hero Uday Kira

తాజాగా వారి అడుగు జాడల్లో నడుస్తుంది దీప.అటు చిత్రం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ కిరణ్ తన కెరీర్ లో వరుస హిట్స్ తో దూసుకుపోయాడు.అయితే ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా కిందికి దిగిపోయాడు.

Whereabouts Of Hero Uday Kiran Sister Deepa Venkat, Deepa Venkat, Hero Uday Kira

చివరకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఇప్పటికీ అతడి ఆత్మహత్య మిస్టరీగానే మిగిలింది.అయితే ఉదయ్ కిరణ్ సిస్టర్ స్టార్ హీరోయిన్స్ కి డబ్బింగ్ చెబుతుందని ఈమధ్య పలు కథనాలు వస్తున్నాయి.

తీరా చూస్తే ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన శ్రీరామ్ మూవీలో అనిత హీరోయిన్ గా చేసింది.ఇందులో ఉదయ్ చెల్లిగా దీప వెంకట్ నటించింది.నిజానికి దీప వెంకట్ మొదట్లో డబ్బింగ్ చెప్పేదట.

వడ్డే నవీన్, రాశి జంటగా నటించిన మనసిచ్చి చూడు మూవీలో నటించింది.ఇలా సినిమాల్లో చేస్తూనే డబ్బింగ్ కూడా చెబుతోంది.

Whereabouts Of Hero Uday Kiran Sister Deepa Venkat, Deepa Venkat, Hero Uday Kira
పెద్దలు చక్కెర తినడం కన్నా బెల్లం తినడం మేలు అంటారు ఎందుకో తెలుసా...?

ఈమెకు తెలుగుతో పాటు తమిళం బాగా వచ్చు.దాంతో నటనకు దూరం జరిగి, కోలీవుడ్ లో డబ్బింగ్ చెబుతోంది.కత్రినా కైఫ్, విద్యాబాలన్, సిమ్రాన్, జ్యోతిక, సౌందర్య, స్నేహ, లక్ష్మీరాయ్, అనుష్క శెట్టి తదితర హీరోయిన్స్ కి దాదాపు 100 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పింది.

Advertisement

ప్రస్తుతం పలు సినిమాలకు డబ్బింగ్ చెప్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తుంది.

తాజా వార్తలు