గెటప్ శ్రీను ఏం అయ్యాడు.. జబర్దస్త్ లో లేడు.. అక్కడ కనిపించడం లేదు?

ప్రస్తుతం జబర్దస్త్ రానురాను పూర్వవైభవం కోల్పోతోంది.జబర్దస్త్ షో నుంచి ఒక్కొ కమెడియన్ బయటకు వెళ్లిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో హైపర్ ఆది,సుడిగాలి సుధీర్, గెటప్ శీను లాంటి కమెడియన్లు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.జబర్దస్త్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు కొందరు వేరే చానల్స్ లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు.

అంతే కాకుండా కొందరు ఫిలిం మేకర్స్ అయితే జబర్దస్త్ లో కొంచెం అనుభవం ఉంటే చాలు కళ్ళకు అద్దుకుని తీసుకుంటాం అని చెప్పి ముందుకు వస్తున్నారు.ఇకపోతే జబర్దస్త్ లో ఒక పది సీట్లు లో కనిపించి జనాలలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు అంటే సినిమాల్లో లేదా పక్క ఛానల్స్ లో మంచి గుర్తింపు వస్తుంది.

పక్క ఛానల్స్ చేయడంతో పాటు హీరోలుగా సినిమాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు.క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా చేస్తున్న వారు ఉన్నారు.

Advertisement

అలాంటి వారిలో గెటప్ శీను కూడా ఒకరు.అయితే జబర్దస్త్ షోలో చాలామంది పంచులు వేసి నవ్విస్తే గెటప్ శీను మాత్రం తన గెటప్ తోనే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే గెటప్ శ్రీను బుల్లితెర కమలహాసన్ అన్న పేరు కూడా దక్కించుకున్నాడు.గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

శీను తో పాటుగా వెళ్లిపోయిన సుధీర్ మాత్రం పక్క షోలలో యాంకరింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు.కానీ గెటప్ శ్రీను మాత్రం కనిపించడం లేదు.

ప్రస్తుతం శీను ఎక్కడ ఉన్నాడు?ఏం చేస్తున్నాడు?అన్న విషయాలు తెలియయడం లేదు అయితే మొన్నటి వరకు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీ బిజీగా ఉన్న గెటప్ శీను సినిమాల కారణంగా జబర్దస్త్ లో కనిపించడం లేదు.

సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

ఇకపోతే ఇదివరకే అలా కొద్ది రోజులలో కనిపించకపోయినా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్ కి శీను మళ్ళీ రాడు అని క్లారిటీ వచ్చేసింది.అందుకు అనుగుణంగానే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత శీను మరే ఇతర చానల్లో కనిపించడం లేదు.

Advertisement

ప్రస్తుతం గెటప్ శీను ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు? అసలు ఏం జరిగింది అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం గెటప్ శీను చేతిలో ప్రస్తుతం అరడజను పైగా సినిమాలు ఉండటంతో ఆ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉండటంవల్ల శీను కనిపించడం లేదు అని గెటప్ శీను సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.