విరాళాలు ఎక్క‌డి నుంచి వ‌స్తున్న‌య్..! వైసీపీలో చ‌ర్చ‌

పొలిటిక‌ల్ పార్టీల‌కు విరాళాలు అంద‌డం తెలిసిందే.అయితే అ విరాళాలు ఎవ‌రు ఇస్తారు.

ఎక్క‌డ నుంచి వ‌స్తాయి.ఇది లెక్క‌లు చూపించే సొమ్మెనా.

ఇలా ఎన్నో అనుమానాలు కూడా ఉంటాయి.ఒక‌వేళ లెక్క‌ల్లోకి రాని డబ్బు అయితే ప్ర‌భుత్వాలు స్వాదీనం చేసుకుంటాయి.

మ‌రి ఎవ‌రు ఇచ్చారో కూడా తెలియ‌ని సొమ్ముని రాజ‌కీయ పార్టీలు ఎలా వినియోగించుకుంటున్నాయ‌నేది ప్ర‌శ్న‌.కోట్ల డ‌బ్బు పార్టీల ఖ‌జానాకు వ‌చ్చి చేరుతోంది.

Advertisement
Where Are The Donations Coming From Discussion In YCP Details, BJP, YCP, Jaganmo

ఇదే సొమ్ము సాధార‌ణ పౌర‌ల‌కు వ‌స్తే లెక్క‌లు క‌డ‌తారు.మ‌రి రాజ‌కీయ పార్టీల విష‌యంలో అది జ‌ర‌గ‌దా అంటున్నారు.

సామాన్యుడికి ఒక లెక్క‌.పొలిటిక‌ల్ పార్టీల‌కు ఒక లెక్కా.

అని ప్ర‌శ్నిస్తున్నారు.

బీజేపీకి వైసీపీకి

ఇక ఇదిలావుంటే కేంద్రంలో అధికారంంలో ఉన్న బీజేపీకి ఏకంగా 146 కోట్ల రూపాయలు విరాళాలుగా అందాయి.

అయితే ఈ సొమ్మును ఎవరు ఇచ్చారు? ఎలా ఇచ్చారు.? ఎందుకు ఇచ్చారు అనేది మాత్రం తెలిసినా ఎవరూ చెప్పలేని విషయం.ఇక ఈ పరంపరలోనే వైసీపీకి కూడా 96 కోట్ల రూపాయలు అందినట్టు నివేదిక స్పష్టం చేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఆ నిధులు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పలేదు.దీంతో ఏపీ అధికార పార్టీ వైసీపీలో తాజాగా మారిన పరిణామాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

Where Are The Donations Coming From Discussion In Ycp Details, Bjp, Ycp, Jaganmo
Advertisement

అయితే.కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి వచ్చాయంటే ఓ అర్థం ఉంది.పైగా వైసీపీకి అందిన విరాళాలతో పోల్చుకుంటే.

బీజేపీకి అందినవి తక్కువనే అంటున్నారు.జాతీయపార్టీగా ఉన్న బీజేపీకి వచ్చింది 146 కోట్లు.

ఎందుకంటే దేశంలో అధికారంలో ఉంది కాబ‌ట్టి వ‌చ్చాయ‌నుకుందాం కానీ ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీకి 96 కోట్లు రాగా వ్యత్యాసం కేవలం 50 కోట్లు మాత్రమే.అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి.

ప్రాంతీయ పార్టీకి ఇంతే తేడా ఉండ‌టం ఇప్పుడు ఇదే చర్చకు వస్తోంది.ఇంత భారీ మొత్తంలో జగన్ కు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి.

అనే విషయాలు పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.ఇక దీనిపై ఏం వివ‌ర‌ణ ఇచ్చుకుంటారో చూడాలి.

తాజా వార్తలు