సినిమాలో చిన్న పాత్ర ఇవ్వాలని ఎన్టీఆర్ ను అడిగిన శోభన్ బాబు.. ఏమైందంటే?

నటుడిగా, ప్రజా నాయకుడిగా సీనియర్ ఎన్టీఆర్ కు సినిమా ఇండస్ట్రీలో పేరుంది.400 సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ నటించడంతో పాటు పదుల సంఖ్యలో సినిమాలకు సీనియర్ ఎన్టీఆర్ నిర్మాతగా వ్యవహరించారు.

ప్రతిభ ఉన్న నటీనటులను సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సహించడంతో పాటు వారికి అవకాశాలు రావడానికి ఎన్టీఆర్ కారణమయ్యారు.

సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దైవబలం అనే సినిమాతో శోభన్ బాబు నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.దైవబలం సినిమాలో శోభన్ బాబు గంధర్వ కుమారుడి పాత్రలో నటించగా ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే దైవబలం సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో శోభన్ బాబుకు ఆ తర్వాత రోజుల్లో కూడా చిన్న పాత్రలే వచ్చాయి.ఆ తర్వాత భక్త శబరి అనే సినిమాలో శోభన్ బాబు ముని కుమారుడి పాత్రలో నటించారు.

ఆ సినిమాలో శోభన్ బాబు పాత్ర పేరు కరుణ కాగా తన కొడుకుకు కూడా శోభన్ బాబు అదే పేరు పెట్టుకున్నారు.ఆ తరువాత సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో సీతారామ కళ్యాణం అనే సినిమా షూటింగ్ మొదలు కానుందని శోభన్ బాబుకు తెలిసింది.

When Shobhan Baabu Met Ntr To Ask For A Role In Seetharama Kalyanam Details, Lax
Advertisement
When Shobhan Baabu Met Ntr To Ask For A Role In Seetharama Kalyanam Details, Lax

సీతారామ కళ్యాణం సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రావణుడి పాత్రలో నటిస్తుండగా అప్పటికే రాముని పాత్ర ఫిక్స్ కావడంతో తనకు లక్ష్మణుడి పాత్ర ఇవ్వాలని శోభన్ బాబు ఎన్టీఆర్ ను అడిగారు.సీనియర్ ఎన్టీఆర్ వెంటనే ఆ పాత్రలో శోభన్ బాబు నటించడానికి ఓకే చెప్పారు.

When Shobhan Baabu Met Ntr To Ask For A Role In Seetharama Kalyanam Details, Lax

సినిమాలో లక్ష్మణుని పాత్ర చిన్నదే అయినా ఏకంగా 56 రోజుల పాటు శోభన్ బాబు ఆ సినిమా కోసం పని చేయాల్సి వచ్చింది.ఆ తరువాత సీనియర్ ఎన్టీఆర్ శోభన్ బాబుకు భీష్మ సినిమాలో అర్జునుని వేషం ఇచ్చారు.ఆ తరువాత శోభన్ బాబు వీరాభిమన్యు సినిమాలో హీరో పాత్రలో నటించి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు