కొత్త సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు అంటే..లింగోద్భవ తేదీ ఎప్పుడో తెలుసా..

మహాశివరాత్రి కోసం శివ భక్తులు వేయికళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మహాశివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది.

శివపార్మతుల కళ్యాణం జరిగిన ఈరోజు శివపార్వతుల ఆశీస్సుల కోసం భక్తులు కఠినమైన ఉపవాసం జాగరణలు చేస్తూ ఉంటారు.మహాశివరాత్రి రోజున శివునికి ప్రత్యేక ప్రతిష్టాపన పూజలు జరిపిస్తారు.

పంచామృతాలతో శివుని రుద్రాభిషేకం చేస్తారు.బిల్వపత్ర వివిధ రకాల పూలను శివునికి సమర్పిస్తూ ఉంటారు.పలుగున మాస చతుర్దిశనాడు మహాశివరాత్రి ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.2023లో మహాశివరాత్రి ఫిబ్రవరి 18న వచ్చే అవకాశం ఉంది.పాల్గొన మాసంలోని చతుర్దశి తిధి ఫిబ్రవరి 17న రాత్రి 8 గంటల రెండు నిమిషములకు మొదలై ఫిబ్రవరి 18న సాయంత్రం నాలుగు గంటల 18 నిమిషములకు ముగిసే అవకాశం ఉంది.మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించే భక్తులకు ఫిబ్రవరి 19 తేదీన ఉదయం 6.57 నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల 33 నిమిషముల వరకు పారాయణకు శుభ సమయం.మహాశివరాత్రి రోజున శివలింగానికి పంచామృత అభిషేకం చేస్తారు.

భక్తితో పాలు, నెయ్యి, పంచదార, తేనె, పెరుగు, గంగాజలాన్ని ఆ మహా శివునికి భక్తులు సమర్పిస్తూ ఉంటారు.కుంకుమపువ్వు కలిపినా నీటిని నైవేద్యంగా పెట్టడం ఎంతో శుభంగా భావిస్తారు.

Advertisement
When Is Mahashivratri In The New Year..Do You Know When Is Lingodbhava Date , L

చందనంతో అడ్డునామాలు పెడతారు.బిల్వపత్రం, చెరుకు రసం, పువ్వులు, పండ్లు, స్వీట్లు పరిమళ ద్రవ్యాలు, వస్త్రాలు సమర్పించడం మంచిది.

When Is Mahashivratri In The New Year..do You Know When Is Lingodbhava Date , L

ఈ రోజున శివునికి పాయసం, అరటి పండ్లను సమర్పించడం ఎంతో పవిత్రంగా భక్తులు భావిస్తారు.దీపం వెలిగించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారు.అభిషేకం తర్వాత ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ఎంతో మంచిది.

ఇంకా చెప్పాలంటే జీవితంలో ఆటంకాలు సమస్యలు తొలగిపోవాలంటే మహాశివరాత్రి రోజున కఠినమైన ఉపవాసం పాటించడం మంచిది.శివునికి నల్ల నువ్వులు సమర్పించడం ఆ ఇంటి కుటుంబ సభ్యులకి శుభం కలుగుతుంది.

ఆ తర్వాతి రోజు అనాదలకు, నిస్సాయులకు, నిరుపేదలకు మన స్థాయికి తగ్గట్టు దానం చేయడం ఆ శివునికి ఎంతో ఇష్టం.అంతేకాకుండా ఆకలి అన్నవారికి భోజనం పెట్టడం కూడా మంచిదే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ఐశ్వర్యం, సౌభాగ్యం పెరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు