మీది జిడ్డు చ‌ర్మ‌మా..అయితే ఈ పిండి వాడాల్సిందే!

జిడ్డు చ‌ర్మ త‌త్వం క‌ల‌వారు ఎన్ని ఇబ్బందులు ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఎన్ని సార్లు ఫేస్ వాష్ చేసుకున్నా మ‌ళ్లీ కొన్ని క్ష‌ణాల్లోనే ముఖం జిడ్డుగా మారిపోతుంది.

మేక‌ప్ వేసుకున్నా.కొంత సేప‌టికే పోతుంది.ముఖ్యంగా స‌మ్మ‌ర్‌లో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది.

ఇక ఇలాంటి వారిలో మొటిమ‌ల స‌మ‌స్య కూడా అధికంగానే ఉంటుంది.అందుకే జిడ్డు చ‌ర్మాన్ని నివారించుకునేందుకు నానా పాట్లు ప‌డుతుంటారు.

ర‌క‌ర‌కాల క్రీములు వాడుతుంటారు.కానీ, ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.

Advertisement

జిడ్డు చ‌ర్మానికి బై బై చెప్పేయ‌వ‌చ్చు.ముఖ్యంగా జిడ్డు చ‌ర్మానికి చెక్ పెట్ట‌డంలో గోధుమ పిండి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఈ పిండిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి మ‌రియు ట‌మాటా గుజ్జు వేసి బాగా మిక్స్ చేసి.

ముఖానికి అప్లై చేయాలి.పావు గంట పాటు ఆరనిచ్చి.

ఆ త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేస్తే చ‌ర్మ రంద్రాల్లో అధికంగా ఉండే నూనెలు తొలిగిపోతాయి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

దాంతో ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.అలాగే గోధుమ పిండిలో చిటికెడు ప‌సుపు, మెంతుల పొడి మ‌రియు క‌ల‌బంద గుజ్జు వేసి మిక్స్ చేసుకుని.

Advertisement

ముఖానికి, మెడ‌కు అప్లై చేయాలి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల వ‌దిలేసి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే.

చ‌ర్మం త‌ర‌చూ జిడ్డుగా మార‌డం త‌గ్గుతుంది.ఒక బౌల్‌ తీసుకుని అందులో గోధుమ పిండి మ‌రియు బంగాళ‌దుంప ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.

ఈ మిశ్ర‌మానికి ముఖానికి ప‌ట్టించి.అర గంట పాటు ఆర‌నివ్వాలి.

ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో ఫేష్ వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు