వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ సజెస్ట్ చాట్ ఫీచర్.. దీంతో ఆ సమస్యకు చెక్..!

ఇటీవలే కాలంలో వాట్సాప్ ( Whatsapp ) యాప్ లేని స్మార్ట్ ఫోన్లు చాలా అరుదు.స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరికి కచ్చితంగా వాట్సప్ అకౌంట్ దాదాపుగా ఉంటుంది.

 Whatsapp New Update With The Suggest Chat Feature Details, Whatsapp , Whatsapp N-TeluguStop.com

దీన్ని బట్టి వాట్సప్ క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు.వాట్సప్ కూడా తమ వినియోగదారుల సౌకర్యాలను, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్, సరికొత్త ఫీచర్ లను పరిచయం చేస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే వాట్సప్ తాజాగా సజెస్ట్ చాట్ ఫీచర్ ను( Suggest Chat Feature ) అందుబాటులోకి తీసుకురానుంది.ఈ ఫీచర్ తో ఇకపై కొత్త కనెక్షన్ లను సులభతరం చెయ్యొచ్చు.

ఈ ఫీచర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

వాట్సప్ సరికొత్తగా పరిచయం చేయనున్న సజెస్ట్ చాట్ ఫీచర్ ఇంటర్ ఫేస్ తో అనుసంధానం చేయడం వల్ల యూజర్లు తమ ప్రస్తుత చాట్ ఆర్డర్ కు అంతరాయం కలగకుండా కొత్త కమ్యూనికేషన్ మార్గాలను అన్వేషించవచ్చు.ఈ ఫీచర్ వల్ల సూచించిన పరిచయాలతో సంభాషణలను ప్రారంభించి సోషల్ నెట్వర్క్ లను( Social Networks ) విస్తృతం చేసుకోవచ్చు.ఈ ఫీచర్ తో సౌకర్యంగా లేని వ్యక్తులు ఈ ఫీచర్ ను వాట్సాప్ నుండి డిసేబుల్ చేయవచ్చు.

ప్రస్తుతం వాట్సప్ చెల్లింపుల విషయంలో ఓ సరికొత్త ఫీచర్ ను అభివృద్ధి చేస్తోంది.ఇప్పటికే యాప్ లో భాగమైన యూపీఐ తో( UPI ) భారతీయ బ్యాంక్ ఖాతాదారులను విదేశాలకు నిధులు బదిలీ చేయడానికి అనుమతిస్తుంది.అయితే అంతర్జాతీయ యూపీఐ సేవలను బ్యాంకుల్లో యాక్టివేట్ చేసిన దేశాల్లో మాత్రమే కార్యచరణ అందుబాటులో ఉంటుంది.అంతర్జాతీయ చెల్లింపుల ఫీచర్ ను యూజర్లు మాన్యువల్ గా యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube