అందరు హీరోలు చేస్తున్న పని ప్రజ్ఞా జైస్వాల్ చేస్తే తప్పేంటి ?

సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లు అటు బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా ఎంతో బిజీగా ఉంటారు.

ఒకవైపు సినిమాలో భారీగా రెమ్యునరేషన్ తీసుకోవటమే కాదు మరోవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా కోట్లు సంపాదిస్తూ ఉంటారు.

ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది హీరోయిన్లు వివిధ బ్రాండ్ లకు ప్రమోషన్లు చేస్తూ రెండు చేతులారా సంపాదిస్తున్నారు ఇది చూస్తూనే ఉన్నాం.ఎవరైనా హీరోయిన్ నటించిన సినిమా సూపర్ హిట్ అయిందంటే చాలు ఇక ఆ సినిమా లోని హీరోయిన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడానికి ఎన్నో కంపెనీలు ఇష్ట పడుతూ ఉంటాయి.

సాధారణంగా హీరోయిన్లు అన్ని రకాల బ్యాడ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్ కూడా చేయడం చూస్తూ ఉంటాం.

ఇలా హీరోయిన్ ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్స్ చేశారు అంటే ఇక హీరోయిన్ ను సోషల్ మీడియాలో తిట్టిపోయడం లేదా ట్రోలింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇక ఒకప్పుడు సమంత సహా మరికొంతమంది హీరోయిన్లు కూడా ఇలా ట్రోలింగ్ కు గురయ్యారు అనే విషయం తెలిసిందే.

Advertisement
Whats Wrong With Promoting Alchold With Pragna Pragna Jaiswal, Alchold Brand P

ఇప్పుడు ప్రజ్ఞా జైస్వాల్ కూడా ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొంటోంది.మొన్నటి వరకు ఈ అమ్మడు ఇండస్ట్రీలో కనిపించలేదు.

కానీ అదృష్టం కలిసొచ్చి బాలయ్య అఖండ సినిమాలో అవకాశం వచ్చింది.

Whats Wrong With Promoting Alchold With Pragna Pragna Jaiswal, Alchold Brand P

మరింత అదృష్టం కలిసొచ్చి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.దీంతో ఇక ఇప్పుడు మరో సారి తెరమీదకి వచ్చి ఇక అడపాదడపా అవకాశాలు అందుకుంటూన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్ చేసింది.ఇక నెటిజన్లు ఊరుకుంటారా ఎప్పుడు ఏం దొరుకుతుందా అని ఎదురు చూసే నెటిజన్లు ప్రజ్ఞా జైస్వాల్ ను ఒక రేంజ్ లో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.

అయితే హీరోలు ఆల్కహాల్ ప్రమోషన్ చేస్తే గుట్కా ప్రమోషన్లు చేస్తే చూసీచూడనట్లు ఉండే నెటిజన్లు ఎందుకో ఆడవాళ్ళు మాత్రం ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్ చేస్తే ఓర్చుకోలేకపోతున్నారు అనేదే ఇపుడు ప్రశ్న.బార్ లలో సైతం ఆడవాళ్లు పని చేస్తూ ఉంటారు.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

ఇక ఏ బ్రాండ్ ప్రమోషన్ లో అయినా ఆడవాళ్లు ఉంటేనే అందం ఆకర్షణ ఉంటుంది అని అంటూ ఉంటారు.అలాంటి ఆడవాళ్లు ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్ చేస్తే తప్పు అంటూ తెగ ట్రోలింగ్ చేయడంపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

కొంతమంది ప్రజ్ఞా జైస్వాల్ పై ట్రోలింగ్ ని వ్యతిరేకిస్తున్నారు.

తాజా వార్తలు