రోజూ ఉపయోగించే టూత్‌పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా? టూత్ పేస్ట్ తయారీకి ఏఏ పదార్థాలు వినియోగిస్తారో మీకేమైనా తెలుసా? దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.జంతువుల ఎముకల పొడిని టూత్‌పేస్ట్‌లో కలుపుతారని గతంలో ప్రచారం జరిగింది.
దీంతో చాలామంది స్థానిక దంతాల పరిశుభ్రతా ఉత్పత్తుల దిశగా దృష్టి సారించారు.ఈ నేపద్యంలో పలు టూత్‌పేస్ట్ కంపెనీలు.
టూత్‌పేస్ట్‌ను సిద్ధం చేయడానికి దాదాపు ఒకే ఫార్ములాను అనుసరిస్తున్నాయి.ఉదయం నిద్ర లేవగానే టూత్‌పేస్ట్‌తో రోజు ప్రారంభించి, ఆ తర్వాతనే ఏదైనా తినడానికి ఇష్టపడతారు.
దశాబ్దాల క్రితం బొగ్గు, నత్త గుండ్లు, చెట్టు బెరడు, బూడిద ఎముకల పొడిని టూత్‌పేస్ట్ తయారీకి ఉపయోగించేవారు.అయితే ఇప్పుడు వీటి వాడకాన్ని పూర్తిగా నిలిపివేశారు.దంతవైద్యులు తెలియజేసిన వివరాల ప్రకారం.దంతాల నుండి క్రిములను తొలగించడానికి కాల్షియం కార్బోనేట్, డీహైడ్రేటెడ్ సిలికా జెల్‌ను టూత్‌పేస్ట్‌లో కలుపుతారు.
అదనంగా ఇందులో ఫ్లోరైడ్ కూడా ఉంటుంది.ఇది దంతాలు విరిగిపోకుండా కాపాడుతుంది.
ఫ్లోరైడ్‌ను దంతాలను బలోపేతం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
టూత్‌పేస్ట్ కొద్దిగా తీపిగా ఉండటానికి, దానిలో స్వీటెనర్లను కలుపుతారు.ఇంతేకాదు టూత్‌పేస్ట్‌లో సింథటిక్ సెల్యులోజ్ కూడా ఉంటుంది.తెల్లని నురుగు కోసం, సోడియం లారెల్ సల్ఫేట్ దానికి జోడిస్తారు టూత్‌పేస్ట్‌లో జంతువుల ఎముకల పొడిని కలపడంపై వివాదం చెలరేగడంతో 2015 సంవత్సరం నుండి జపాన్‌లో కోల్గేట్‌ను నిషేధించారు.