వాట్సాప్ మరో కొత్త ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటిప్పుడూ కొత్త ఫీచర్లతో తమ యూజర్లను ఆకట్టుకుంటోంది.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో వాడే యాప్ ఏదైనా ఉందంటే.

అది వాట్సాప్ అనడంలో సందేహం అక్కర్లేదు.సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ వాడుతున్నారు.

యూజర్లను దృష్టిలో ఉంచుకొని త్వరలో వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్‌లను ఎడిట్ చేసే ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుంది.దీని ద్వారా వినియోగదారులు మెసేజ్‌ల్లో టైపింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేయవచ్చు.

దీని ద్వారా మనం ఏదైనా తప్పుగా మెసేజ్ చేసినా దానిని డిలీట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.దీంతోపాటు మెసేజ్ రియాక్షన్లకు కూడా ప్రత్యేకమైన స్కిన్ టోన్ అందుబాటులోకి రానుంది.

Advertisement

వాట్సాప్ బీటా ట్రాకర్ WABetaInfo కథనం ప్రకారం.టెక్స్ట్ మెసేజ్‌లను ఎడిట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ పరీక్షించడం ప్రారంభించింది.

అయితే మీరు మెసేజ్‌లను ఎడిట్ చేస్తే ఎడిట్ చేసిన విషయం యూజర్‌కి తెలుస్తుందో లేదో మాత్రం ఇందులో సమాచారం లేదు.యాప్‌లో మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది.

దానిపై క్లిక్ చేసి మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు.ప్రస్తుతం ఇవి బీటా టెస్టింగ్‌లో ఉన్నాయి.

టెస్టింగ్ పూర్తయ్యాక అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.దీంతోపాటు ఐవోఎస్, డెస్క్‌టాప్ యూజర్లకు కూడా త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.గత 5 సంవత్సరాలుగా వాట్సాప్ మెసేజ్‌లను ఎడిట్ చేయడంపై కంపెనీ పనిచేస్తుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
సినిమా ట్రైలర్స్ వ్యూస్ వెనుకున్న అసలు మోసం ఏంటో తెలుసా?

అయితే ఇప్పటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తోంది.ఎడిట్‌తో పాటు మెసేజ్ రియాక్షన్లను కూడా వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

Advertisement

ఈ ఆప్సన్ అందుబాటులోకి వస్తే తమకు సౌకర్యంగా ఉంటుందని పలువురు యూజర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.