మీ కలలో దేవుడు కనిపిస్తే.. మంచిదా.. చెడ్డదా..?

సాధారణంగా నిద్రపోయాక ప్రతి ఒక్కరికి ఏదో కల వస్తూనే ఉంటుంది.కొంత మంది ఆ కలలు మెలకువ వచ్చిన తర్వాత మర్చిపోతారు.

కొన్ని కలలు చాలా కాలం వరకు గుర్తుంటాయి.కొన్నిమర్చిపోలేనివి.

కొన్ని సార్లు మనకి కలలో దేవుడు కనిపిస్తాడు.మరి మన కలలో దేవుడు కనిపించడం మంచిదేనా.

అది దేనికి సంకేతమే తెలుసా.ఏ ఏ దేవుడు కనిపిస్తే పరిణామాలు ఉంటాయో తెలుసుకోవాలని ఉందా.

Advertisement
What Will Happen When God's Come In Your Dream, God, Dream, Lord Shiva, Rama, K

అయితే ఈ కథనం చదివేయండి.

శివుడు కలలోకి వస్తే.

.మీ కలలో శివుడి కనిపిస్తే.

మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నారని అని అర్ధం.శివుడు కలలోకి వచ్చాడంటే.

అన్ని ఇబ్బందులు తొలిగినట్లే.మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, అది కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

రాముడిని కలలో చూస్తే.మీరు కలలో రాముడిని చూస్తే.

Advertisement

చాలా శుభప్రదం.మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయట.

అయితే మీ విధులను సక్రమంగా నిర్వర్తించాలని సంకేతం.

దుర్గమ్మ కోపంగా కనిపిస్తే

మీ కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతం.అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం.

ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయట.

లక్ష్మీదేవి కలలో కనిపిస్తే.

మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే.సంపదకు చిహ్నం.కలలో లక్ష్మీమాతను చూస్తే.

మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.లాభాలను పొందుతారని అంటారు.

కలలో శ్రీకృష్ణుని దర్శనం.మీకు కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే.

స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని అర్ధం.ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.

ఈ కల చాలా మంచిదట.

తాజా వార్తలు