చెడు కలలు వచ్చినపుడు ఏం చేయాలి?

కొందరికి నిద్రలో విపరీతమైన కలలు వస్తుంటాయి.కొన్ని కలలు బాగుంటాయి.

జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నట్లు లేదా ఏదైనా విజయం సాధించినట్లు కలలు వస్తుంటాయి.

లేదా ఇష్టమైన వాటిని దక్కించుకున్నట్లు కొందరు కలలు కంటారు.

అభిమాన తారను కలిసినట్లు, లేదా మంచి జీతంతో ఉద్యోగం సాధించినట్లు, పరీక్షల్లో మెరుగైన మార్కులు పొందినట్లు ఇలా చాలా కలలు వస్తుంటాయి.ఇలాంటి కలలు వచ్చినప్పుడు మనసు హాయిగా ఉంటుంది.

కోరుకున్న పని జరిగినా, ఆశించిన వస్తువు అందుకున్నా సంతోషం కలగడం సహజం.కానీ కొందరికి నిద్రలో పీడకలలు వస్తుంటాయి.

Advertisement

చెడు కలలు తరచూ వస్తూ నిద్ర నుండి ఉలిక్కి పడి లేచేలా చేస్తాయి.ఇలాంటి చెడు కలల నుండి ఎంతగా బయట పడాలని కోరుకున్నా అది కొన్ని సార్లు సాధ్యం కాకపోవచ్చు.

పీడకలలు పడగానే రెండు రకాల భయాలు పుడతాయి.ఒకటి ఆ పీడకలల భయం అయితే.

అవి నిజ జీవితంలో ఎక్కడ నిజమవుతాయోననే భయం అయితే.పడుకున్న వేళ వచ్చే కలలు అవి వచ్చే టైమును బట్టి వాటి ఫలితం ఉంటుంది.

తెల్లవారుజామున కలిగే ఫలితాలు నిజాలు అవుతాయని అంటారు.ఇలా ఉదయం వేళ వచ్చే కలలు వెంటనే ఫలిస్తాయట.

రెండు శివలింగాలు ఉండే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?

రాత్రి వేళ వచ్చే కలల ఫలితం కొంత ఆలస్యంగా ఉంటుంది.అనారోగ్యంతో ఉన్నపుడు ఒకే విషయం గురించి, ఎక్కువగా ఆలోచించేటప్పుడు ఆ విషయాలు స్వప్నంలోవస్తే పెద్దగా దోషం ఉండదు.

Advertisement

అలా కాకుండా తనకు లేదా తనవారికి ఇబ్బంది ఉన్నట్టు లేదా స్వప్న శాస్త్రం ప్రకారం దుష్ఫలితాలు కలిగించే కలలు వచ్చినపుడు వెంటనే నిద్రమేల్కొంటే, దుర్గా అమ్మవారిని స్మరించుకోవటం చేస్తే సరిపోతుంది.మరసటిరోజు ఉదయం తలస్నానం చేసి, కనీసం మూడు రకాల నూనెలు కలిపి ఇష్ట దేవత ముందు దీపం వెలిగించాలి.

స్వప్న దోష పరిహారం కోసం ఉప్పు లేదా గుమ్మడి కాయ లేదా నిమ్మకాయ పూజసమయంలో అచ్చట ఉంచి తర్వాత దూరంగా పారవేయాలి.

తాజా వార్తలు