అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో తెలుసా?

అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుక్లపక్ష మూడవ రోజు వస్తుంది.

ఈ క్రమంలోనే 2021 సంవత్సరంలో మే 14న హిందువులు అక్షయ తృతీయ జరుపు కుంటారు.

ఈ అక్షయ తృతీయ రోజు పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు.ఇంతటి పవిత్రమైన రోజున మనం ఏ కార్యం నిర్వహించిన మంచి జరుగు తుందని పండితులు చెబుతున్నారు.

ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ప్రజలు పెద్ద ఎత్తున బంగారు నగలు ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు.అదే విధంగా దానధర్మాలను కూడా చేస్తారు.

మరి రాశి ప్రకారం ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయడం వల్ల శుభం కలుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Donate These Things On Akshaya Tritiya According To Your Zodiac Sign, Akshaya Tr
Advertisement
Donate These Things On Akshaya Tritiya According To Your Zodiac Sign, Akshaya Tr

*మేష రాశి:

ఈ రాశివారు అక్షయ తృతీయ రోజున ఎర్రటి పప్పు ధాన్యాలను, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పుష్పాలను దానం చేయడం వల్ల శుభం కలుగుతుంది.

*వృషభం:

ఈ రాశివారు ఆవు దూడ, బియ్యం, నీలి రంగు వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.

*మిధునం:

మిధున రాశి వారు ఈ రోజు పప్పు ధాన్యాలు, బంగారం, ఆకు పచ్చ రంగులో ఉన్నటు వంటి ఏ వస్తువులైన దానం చేయాలి.

*కర్కాటకం:

ఈ రాశివారు ఎంతో పవిత్రమైన ఈ రోజున చక్కెర, పాలు, పెరుగు, వెండి, తెలుపు రంగు వస్త్రాలను, ముత్యాలు వంటివాటిని దానం చేయడం ఎంతో ఉత్తమం.

Donate These Things On Akshaya Tritiya According To Your Zodiac Sign, Akshaya Tr

*సింహం:

ఈ రాశి వారు కొవ్వొత్తులు, కర్పూరం, రాగి, ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను దానం చేయాలి.

* కన్య:

అక్షయ తృతీయ రోజు కన్యా రాశి వారు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి మొక్కలు లేదా బట్టలు, కూరగాయలను దానం చేయాలి.

*తుల:

ఈ రాశివారు నువ్వులు, మజ్జిగ, పెరుగు, చెప్పులు, నీలిరంగు వస్త్రాలను దానం చేయాలి.

* వృశ్చికం:

వృశ్చిక రాశి వారు ఈరోజు గంధం, తిలకం, ఎరుపు రంగులో ఉండే వస్తువులను, వస్త్రాలను దానం చేయడం ఎంతో శుభకరం.

* ధనస్సు:

ఈ రాశి వారు అక్షయ తృతీయ రోజున మతపరమైన పుస్తకాలు, పసుపు రంగు బట్టలు, తీపి అన్నం వంటి వాటిని దానం చేయాలి.

* మకరం:

మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున నల్లటి వస్తువులను, ఇనుమును, నలుపు రంగు వస్త్రాలను దానం చేయాలి.

* కుంభం:

ఈ రాశివారు అక్షయ తృతీయ రోజున కొబ్బరి నీళ్ళు, గొడుగు, చెప్పులు ఏడు రకాల ధాన్యాలను దానం చేయాలి.

* మీనం:

ఈ రాశి వారు బంగారం లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం ఎంతో మంచిది.

Advertisement

తాజా వార్తలు