రంగమార్తాండ సినిమా( Rangamarthanda ) థియేటర్లలో విడుదల అయింది.నిన్న మొన్నటి వరకు ప్రివ్యూలు చూసి ఎంతోమంది సినిమా చాలా గొప్పగా ఉందని చెప్పారు.
అది ఎంతవరకు నిజం అనే విషయం ఈరోజు తేటతెల్లమయింది ఇంతకు ముందు ఇలా సెలెక్టివ్ వ్యక్తులకు సినిమాలు చూపించి ఆ సినిమాను సొమ్ము చేసుకునే పద్ధతి లేదు.కానీ ఇప్పుడు దిల్ రాజు బలగం సినిమా( Balagam ) పుణ్యమా అని రంగమార్తాండ చిత్రానికి కూడా అదే రకమైన ప్రమోషన్ టెక్నిక్ పాటించి కృష్ణవంశీ ( Krishnavamsi ) ఒకింత సక్సెస్ అయ్యాడు.
కానీ సినిమాను ఆశాంతం రక్తి కట్టించడంలో మాత్రం విఫలమయ్యాడని చెప్పక తప్పని పరిస్థితి.మరాఠీలో ఒక విజయవంతమైన సినిమాను తెలుగులో చాలా రకాల మార్పులు చేర్పులకు గురిచేసి తెలుగు సినిమాగా మార్చారు.
కానీ మరాఠీలో నానా పాటేకర్ స్థాయికి రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్(
Prakash raj ) ఏ రకంగా కూడా సరిపోలేదు.

కేవలం చిత్రంలో బ్రహ్మానందం ని ఇకపై ఇలాంటి సినిమాలు కూడా చెయ్యొచ్చు.ఇలాంటి ఒక సీరియస్ నటన కూడా చేయొచ్చు.అని కృష్ణవంశీ చాలా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేశాడు కానీ, ఒక బ్రహ్మానందం పాత్ర మినహాయిస్తే రమ్యకృష్ణ కూడా తన స్థాయి నటనను ఈ చిత్రంలో కలపరచలేదు.
వాస్తవానికి రమ్యకృష్ణకు భారీ డైలాగులు, లౌడ్ వాయిస్ తో కూడిన ఆహార్యం చాలా ముఖ్యం.ఆమెను అలాగే ప్రజలు స్వీకరించారు కానీ రంగమార్తాండ సినిమా విషయానికొచ్చేసరికి ఆమె మౌనంగానే ఎన్నో బలమైన అర్థాలు వచ్చే హావాభావాలను పలకించాల్సి వచ్చింది.
అవి ఒకింత ప్లేస్ అయినప్పటికీ ఆమెను ఇంకాస్త బెటర్ గా చూస్తే బాగుండేది.ఇక ప్రకాష్ రాజ్ విషయంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఆయన నటనలో కింగ్ కానీ ఇక్కడ ఆ స్థాయి పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ ఎందుకో జనాలు అతని నటనతో కనెక్ట్ అవ్వలేదు.

ఇక మిగతా పాత్రలు వారి వారి మేరకు బాగానే నటించినా సినిమాలో పూర్తిగా ఫెయిల్ అయింది.నటులు మాత్రమే కాదు దర్శకుడుగా కృష్ణవంశీ కూడా ఎందుకో ఇంకా మనకా క్రియేటివ్ డైరెక్టర్ కనిపిస్తారో లేదో అనే భయం కూడా పట్టుకుంది రంగమార్తాండ సినిమా అతనికి గట్టిగా చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ ఇలాంటి ఒక ని కూడా అర్థం తో కూడిన సినిమాలను కాకుండా తన స్థాయి చిత్రాలను అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు.ఎన్నో అంచనాలు పెట్టుకుని థియేటర్ కి వెళ్లిన ప్రేక్షకుడు సినిమాలో ఏదో మిస్సయ్యారు అనే భావనతో తిరిగి వస్తున్నాడు.
ప్లీజ్ కృష్ణ వంశీ గారు మా కోసం మరొక మంచి సినిమాతో తిరిగి రండి.!
.