వేణు శ్రీరామ్ పరిస్థితి ఏంటి..?ఆయన ఎందుకు భారీ సక్సెస్ ను కొట్టలేకపోతున్నాడు..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు ఎన్ని సినిమాలు చేసినా కూడా సక్సెస్ లను సాధించకపోవడంతో వాళ్ళకు సరైన గుర్తింపు అయితే రాదు.

కానీ మరి కొంతమంది దర్శకులు చేసిన ఒకటి రెండు సినిమాలతో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు.

ఇక ఓ మై ఫ్రెండ్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన దర్శకుడు వేణు శ్రీరామ్( Venu Sriram ).ఆ సినిమా నిరాశపరచడంతో నాని తో ఎంసీఏ అనే సినిమా చేశాడు.

ఈ సినిమా కూడా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన ఒక్కసారిగా డిలా పడిపోయాడు.ఇక పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తో వకీల్ సాబ్ అనే సినిమాని రీమేక్ చేసినప్పటికి ఆ సినిమా కూడా స్లో సో గానే ఆడింది.దాంతో అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఖాళీగానే ఉంటున్నాడు.

ఇక ఇప్పుడు నితిన్( Nitin ) తో తమ్ముడు అనే సినిమాని స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసే ఉద్దేశ్యంతో ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈ సినిమాని కూడా దిల్ రాజే ప్రొడ్యూస్ చేయడం విశేషం.

Advertisement

ఇక ఏది ఏమైనా కూడా తన తదుపరి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

ఆయన కనక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే నెక్స్ట్ మరొక స్టార్ హీరో ను డైరెక్షన్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.అలా కాకుండా సినిమాని ఫెయిల్యూర్ గా నిలిపితే మాత్రం ఇక ఆయనకు సినిమా పరంగా కెరియర్ ఉండదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదంటే చతికల పడిపోతాడా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

చూడాలి మరి ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?
Advertisement

తాజా వార్తలు