ఏంటి ఈ దిక్కుమాలిన ప్రచారం ? కేటీఆర్ ఆగ్రహం

మరోసారి కాంగ్రెస్ ( Congress )చేస్తున్న విమర్శలపై తనదైన శైలిలో మండిపడ్డారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( BRS Working President KTR ).

గత బిఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేయడం వల్లే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల పై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

  రాష్ట్రం దివాలా అంటూ దిక్కుమాలిన ప్రచారం కాంగ్రెస్ చేస్తుందని సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ విమర్శలు చేశారు .వనరులు , అప్పులు,  ఆర్థిక నిర్వహణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సూచీలు వెల్లడిస్తున్నాయని ,ఆరు గ్యారెంటీలు ,  420 హామీలు నెరవేర్చలేక కేసీఆర్ పై కాంగ్రెస్ బురద చల్లుతోందని కేటీఆర్ మండిపడ్డారు.

 తమ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆర్థిక పరిస్థితి పై అర్థంలేని వ్యాఖ్యలతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రిజర్వ్ బ్యాంక్ నివేదికలు , గణాంకాలు , ఆర్థిక మండలి నివేదికలు ఆర్థిక వేత్తల విశ్లేషణలన్నీ తెలంగాణ ఆర్థిక సౌష్టవం( Economic balance of Telangana ) పటిష్టతను పదేపదే నిరూపిస్తున్నాయని కేటీఆర్ అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచురించిన సామాజిక ఆర్థిక నివేదికలో కూడా పదేళ్లుగా తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని గణాంకాలు వెల్లడిస్తున్నాయని కేటీఆర్ తెలిపారు .సొంత ఆదాయం సమకూర్చుకోవడంలో తెలంగాణ ఎప్పుడూ దేశంలో అగ్రస్థానంలోనే ఉందని,  ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి దాటకుండా అప్పుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించిందని కేటీఆర్ అన్నారు.తన వ్యక్తిత్వం పై ఆధారం లేకుండా ఆరోపణలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.

తన వ్యక్తిత్వ హసనం చేసేలా ప్రధాన మీడియాతో పాటు,  సోషల్ మీడియాలో చేసే నీచ ప్రయత్నాలపై ఇకపై కఠినంగా వ్యవహరిస్తానని తెలిపారు.రాజకీయ విమర్శల పేరుతో ఆధారాలు లేకుండా నీచమైన వ్యాఖలు చేసేవారికి కొండా సురేఖ పై వేసిన 100 కోట్ల పరువు నష్టం దావా ఒక గుణపాఠం కావాలని కేటీఆర్ అన్నారు.తెలంగాణా రాష్ట్ర ఆదాయం తగ్గుతుండగా,  కాంగ్రెస్ నాయకుల ఆదాయం భారీగా పెరుగుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Advertisement
పుష్ప 2 లో జగన్ డైలాగ్... ఫుల్ సపోర్ట్ ఇస్తున్న వైసీపీ ఫ్యాన్స్?

తాజా వార్తలు