పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో స్వస్తిక్ గుర్తు ఎందుకు వేస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు శుభానికి గుర్తుగా స్వస్తిక్ గుర్తును వేయటం మనం చూస్తుంటాము.

స్వస్తిక్ గుర్తు వేయటం వల్ల ఆ కార్యక్రమం ఎటువంటి ఆటంకములు లేకుండా శుభంగా పూర్తవుతుందని పండితులు చెబుతుంటారు.

విఘ్నహర్త అయిన గణపతికి స్వస్తిక్ ప్రతీక కాబట్టి,ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఆ కార్యం ఆటంకం లేకుండా ఈ గుర్తును వేస్తారు.అదేవిధంగా స్వస్తిక్ గుర్తును పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో చిన్నపిల్లల తలపై వేస్తారు.

ఈ విధంగా వేయడానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.స్వస్తిక్ గుర్తు సూర్యభగవానుని గతిని సూచిస్తుంది అంటారు కనుక పూర్వకాలంలో సూర్య పూజలకు ఈ స్వస్తిక్ గుర్తు చిహ్నంగా ఉండేది.

అదేవిధంగా దీపావళి వంటి పండుగ సమయాలలో కొత్తగా వ్యాపారం ప్రారంభించే వర్తకులు ఖాతా పుస్తకాలలో స్వస్తిక్ గుర్తును గీస్తారు.అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలలో వివాహసమయంలో వధూవరులకు నుదుటిపై స్వస్తిక్ గుర్తు ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల వారి దాంపత్య జీవితం బాగుంటుందని భావిస్తారు.

What Is The Significance Of The Swastika Symbol Swastika Symbol, Swastika To Gan
Advertisement
What Is The Significance Of The Swastika Symbol Swastika Symbol, Swastika To Gan

పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో చిన్నారుల తలపై స్వస్తిక్ గుర్తును వేస్తారు.శిశువు పుట్టిన సంవత్సర కాలం లోపు శిశువుకు ఈ వెంట్రుకలు కత్తిరించడం జరుగుతుంది.ఈ విధంగా పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత గుండెకు చల్లదనం ఉండటంకోసం గంధం తైలం పూస్తారు.

ఆ తరువాత శిశువు తండ్రి శిశువు తల పై స్వస్తిక్ గుర్తును గీస్తాడు.ఈ విధంగా స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల భగవంతుడు తలచినదే శిశువు కూడా తలచును గాక అనే అర్థాన్ని సూచిస్తుంది.

కనుక వెంట్రుకలు తీసే సమయంలో చిన్న పిల్లలు భగవంతునితో సమానంగా భావించి వారి తలపై ఈ చిహ్నాన్ని వేస్తారు.ఆ తరువాత శిశువు కుటుంబ సభ్యులందరూ శిశువును ఆశీర్వదిస్తారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు