కామాక్షి దీపం ప్రాముఖ్యత ఏమిటి? ఈ దీపాన్ని ఏ సందర్భాలలో వెలిగిస్తారో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే దీపం( lamp ) ప్రాణానికి ప్రతీక.అలాగే జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అని పండితులు చెబుతూ ఉంటారు.

అందుకే పూజా చేసే సమయనికి ముందు దీపం వెలిగిస్తారు.దేవుడిని ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తారు.

అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ దీపం ఎప్పుడు కూడా మట్టి ప్రమిదలతో వెలిగించాలి.వీటిలో రకాలు కూడా ఉంటాయి.

అందులో ఒకటే కామాక్షి దీపం(Kamakshi lamp ).కామాక్షి దీపం అంటే దీపం మీద గజలక్ష్మి దేవి చిత్రపటం( Goddess Gajalakshmi ) ఉంటుంది.అందుకే ఈ దీపాన్ని గజలక్ష్మీ దీపం అని కూడా అంటారు.

Advertisement

దీపం వెలిగించిన వెంటనే ఆ వెలుగులో అమ్మవారి రూపం కనిపిస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే సర్వదేవతలకు శక్తినిచ్చే శక్తి కామాక్షి దేవికి ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు.అందుకే అన్నీ దేవాలయాల కన్నా ముందుగా కామాక్షి దేవి దేవాలయాన్ని తెరిచి, రాత్రి అన్ని దేవాలయాలు మూసేసిన తర్వాత తలుపులు వేస్తారు.

అంటే మొదట ఈ అమ్మవారి గుడి తలుపు తెరిచాక మిగిలిన దేవాలయాలు తెరిస్తే కామాక్షి అమ్మవారు అందరి దేవతలకు శక్తిని చేకూరుస్తుంది.తర్వాత ఆ అమ్మవారి పవళింపు సేవ ఉంటుందని చెబుతారు.

సర్వశక్తి సంపన్నురాలైన కామాక్షి దేవి వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో ఉంటుందని పండితులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ప్రజలు తమ ఇళ్లలో వ్రతాలు, పూజలు( Vratas , Pujas ) చేసుకున్నప్పుడు అఖండ దీపం వెలిగిస్తారు.ఆ సమయంలో చాలామంది కామాక్షి దీపాన్ని వెలిగిస్తారు.కామాక్షి దీపం కేవలం ప్రమిదను మాత్రమే కాకుండా అమ్మవారి రూపం కలిగి ఉంటుంది.

లోకేష్ యూనివర్స్ కి రంగం సిద్ధం చేస్తున్న దర్శకుడు...మామూలుగా ఉండదు...
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్13, ఆదివారం 2024

అంటే అమ్మవారి బొమ్మ ఈ దీపం మీద ఉంటుంది.ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.

Advertisement

సాధారణంగా దేవుడి ముందు దీపారాధన చేసినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టడం ఆచారం.కామాక్షి దీపాన్ని ఉపయోగించినప్పుడు కుంకుమ పెట్టి చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికి కుంకుమ పెట్టి పువ్వుతో అలంకరించి అక్షింతలు వేసి నమస్కరించాలి.

కామాక్షి దీపాన్ని ఒకే ఒత్తివేసి నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో వెలిగించాలి.

తాజా వార్తలు