మాటల మాంత్రికుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులందర్ని మ్యాజిక్ చేసిన దర్శకుడు త్రివిక్రమ్…( Trivikram ) మొదట రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు.ఇక తను రైటర్ గా ఉన్నప్పుడు సినిమాలు ఇచ్చిన ఉత్సాహంతో డైరెక్టర్ గా మారి వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.
ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు.ఇక ఇదిలా ఉంటే త్రివిక్రమ్ ఎన్ని సినిమాలు చేసిన కూడా ఆయన కెరియర్ లో అతడు సినిమా( Athadu Movie ) అనేది చాలా స్పెషల్ గా నిలిచిపోతుందనే చెప్పాలి.ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ బాబుని( Mahesh Babu ) ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించడమే కాకుండా త్రివిక్రమ్ డైరెక్షన్ పరంగా కూడా చాలా మెచ్యూరిటిని ప్రదర్శించిన సినిమా ఇది…

ఇక ఈ సినిమాలో ఒక సీన్ లో మహేష్ బాబు సునీల్ ని( Sunil ) హనుమంతుడితో పోలుస్తూ తనని తను రాముడు గా పోల్చుకుంటాడు.త్రివిక్రమ్ ఈ సీన్ ను సినిమాలో ఎందుకు పెట్టాడు అంటే వాళ్లిద్దరి క్యారెక్టర్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి.కాబట్టి వాళ్ల మధ్య బంధాన్ని చెప్పాలంటే పురాణాలను బేస్ చేసుకొని చెబితే అది ప్రేక్షకుల్లో ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుందనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ ఈ డైలాగులోనే వాళ్ళ రిలేషన్ షిప్ ని కన్వే చేసినట్టుగా చెప్పాడు.మొత్తానికైతే త్రివిక్రమ్ ఈ సినిమాతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఈ సినిమాలో ఇండెప్త్ గా చాలా సీన్లని చాలా డైలాగుల రూపంలో చాలా డెప్త్ తో ప్రదర్శించారు.ఇక గురూజీ హార్ట్ ఫుల్ వర్క్ చేసిన సినిమా ఇదనే చెప్పాలి.ఇక త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ప్లాప్ ల్లో ఉన్న కూడా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.