కుంభ కర్ణుడు ఎందుకలా ఎప్పుడూ పడుకొనే ఉంటాడు ?

ఎక్కువగా తిన్నా లేదా ఎక్కువగా పడుకున్నా.ఏంటి కుంభ కర్ణుడిలా తిన్నావ్?, కర్ణుడిలా  పడుకున్నావ్? అంటుంటారు చాలా మంది.

తినడం సంగతి పక్కన పెడితే కుంభ కర్ణుడు అంతలా ఎందుకు పడుకుంటాడో తెలుసుకుందాం.

కైకసి పుత్రులైన రావణ, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుణ్ని సంతోషపెట్టి వరాలు పొందాలని ఘోరమైన తపస్సు ప్రారంభిస్తారు.రావణుడు వెయ్యి సంవత్సరాల  తపస్సు పూర్తికాగానే ఒక తలను పూర్ణాహుతి కావిస్తూ పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన పదో తలను కూడా ఆహుతి చేయబోతుండగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటాడు.

తనకు మరణం లేని వరం ప్రసాదించమంటాడు.అలాంటి వరం ప్రసాదించడం అసాధ్యమంటూ మరేమైనా కోరుకొమ్మంటాడు బ్రహ్మ.మానవులు తనకు గడ్డిపరకల వంటివారని, కనుక దేవతలు, గరుడ, గంధర్వ, పన్నగ, యక్షుల చేతిలో  చావు లేకుండా వరం కోరుకుంటాడు రావణుడు.

అలాగేనని అనుగ్రహించిన బ్రహ్మ రావణుడు బలి ఇచ్చిన తొమ్మిది తలలు తిరిగి పుట్టేలా కూడా వరం ఇస్తాడు.కుంభకర్ణుడు గ్రీష్మ రుతువులో అగ్ని మధ్య నిలబడి, వర్షరుతువులో వానలో తడుస్తూ, శిశిరరుతువులో నీటి నడుమ నిలబడి పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు.

Advertisement

అతడి తపస్సుకు మెచ్చి పరమేష్టి వరమీయ సంకల్పించగానే- అతడికి వరాలు ప్రసాదించవద్దని దేవతలు అడ్డుపడతారు.సరస్వతీదేవిని కుంభకర్ణుడి నాలుకపై ప్రవేశపెట్టి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే- నిర్దయ బదులు సరస్వతీదేవి ప్రేరణతో నిద్దుర కావాలంటాడు కుంభకర్ణుడు.

తథాస్తు అంటాడు కమలాసనుడు.విభీషణుడు ఒంటికాలిపై నిలబడి అయిదు వేల సంవత్సరాలు, సూర్యుడి గతిని అనుసరించి తిరుగుతూ మరో అయిదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు.

అతడి తపస్సుకు మెచ్చి బ్రహ్మ వరం  కోరుకొమ్మంటే విభీషణుడు కష్టాలు అనుభవిస్తున్న సమయంలోనూ తన బుద్ధి ధర్మమందే నిలిచి ఉండాలని, సర్వకాల సర్వావస్థల్లో తన బుద్ధి ధర్మమార్గాన్ని వీడిపోకుండా ఉండేలా అనుగ్రహించమని కోరతాడు.ముగ్గురు సోదరులు ఒకేసారి పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసినా వారి బుద్ధులను బట్టి వరాలు పొందగలిగారు.లోకాలను జయించి చిరంజీవి  కావాలనుకున్న రావణుడి కోరిక నెరవేరలేదు.

కోరకుండానే చిరంజీవి కాగలిగాడు విభీషణుడు.కుంభకర్ణుడు శయన మందిరంలో నిద్రావస్థలో ఉండిపోయాడు.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
ఒత్తిడి త్వ‌ర‌గా త‌గ్గించే సులభ ఉపాయాలు.. ఆచరిస్తే బ్ర‌హ్మాండ‌మైన ప్ర‌యోజ‌నం

ఇది కుంభ కర్ణుడి నిద్ర వెనుక ఉన్న కారణం.

Advertisement

తాజా వార్తలు