విశ్వం టీజర్ లో జగన్ డైలాగ్ పెట్టడం వెనక కారణం ఏంటి..?

శీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్(Gopichand) హీరోగా వస్తున్న సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు.

అయినప్పటికీ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ మాత్రం ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది.

ఒకప్పటి శ్రీను వైట్ల మార్క్ కామెడీని చూపిస్తూనే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఇందులో బాగా ఇన్ క్లూడ్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక దాంతో పాటుగా పొలిటిషన్స్ ను కూడా టార్గెట్ చేసి వాళ్ళ డైలాగులను కూడా ఇందులో ఆడ్ చేసినట్టుగా తెలుస్తుంది.

నిజానికి ఎపి మాజీ సీఎం ( YS jagan )అయిన జగన్ చెప్పిన ఒక డైలాగుని గోపీచంద్ టీజర్ ఎండింగ్ లో చెప్పినట్టుగా అతన్ని ఇమిటేట్ చేస్తూ ఒక డైలాగ్ అయితే చెప్పాడు.

ఇక అలాగే తెలంగాణ మాజీ మంత్రి అయిన మల్లారెడ్డి ఒకప్పుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ను ఉద్దేశించి చేసిన ఒక సవాల్ ను కూడా ఇందులో ఒక క్యారెక్టర్ చేత చెప్పించడం అనేది ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.ఇక మొత్తానికైతే ఏదో ఒక కాంటెంపరరీ ఇష్యూ ని తన సినిమాలో ఇన్వాల్వ్ చేస్తూ ఎప్పుడు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు.మరి ఇప్పుడు కూడా అలాంటి ఒక ధోరణికి తెరలేపినట్టుగా తెలుస్తుంది.

Advertisement

ఈ డైలాగుల వల్ల తన సినిమాకి ఏమైనా ఇబ్బంది ఏర్పడే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఇక మొత్తానికైతే శ్రీనువైట్ల( Sreenu Vaitla ) ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని సాధించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి తన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఒక సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటి వరకైతే ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు.

కానీ ఈ టీజర్ తో ఒక్కసారి గా ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఏర్పడ్డాయి.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు