ఆంజనేయ స్వామికి సింధూరమే ఎందుకు పెడ్తారో తెలుసా?

ఆంజనేయ స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది సింధూరమే.అన్ని దేవుళ్లకు పసుపు, కుంకుమలు పెడ్తూ.

ఆంజనేయ స్వామికి మాత్రం సింధూరం ఎందుకు పెడ్తారో రామాయణంలో వివరించారు.అసలు సింధూరం అంటే ఆంజనేయ స్వామికి ఎందుకు ఇష్టం, మనం పూజ చేసుకున్నప్పుడల్లా స్వామి వారికి సింధూరం ఎందుకు పూస్తామో ఇప్పుడు తెలుసుకుందాం.

రామాయణ సంగ్రామం జరుగుతున్నప్పుడు ఓ సందర్భంలో.శ్రీరాముడు ఆంజనేయ స్వామి భుజాలపైకి ఎక్కి యుద్ధం చేశాడు.

ఆనాడు రావణాసురుడు సంధించిన బాణాలు ఆంజనేయుడికీ తగిలాయి.హనుమ ఒళ్లంతా రక్తంతో తడిసిపోయింది.

Advertisement
WHAT IS THE REASON BEHIND ANJANEYA SWAMY SINDHUR, Anajnaya Swami , Sindura, Devo

అయినా ఏమాత్రం చలించకుండా ధృడ దీక్షతో నిలబడ్డాడట ఆ అంజన్న.ఆ సమయంలో ఆంజనేయుడి దేహం పూచిన మోదుగ చెట్టులా ఉందని వాల్మీకి మహర్షి రామాయాణంలో వర్ణించాడు.

తన శ్రీరాముడి కోసం రక్తమోడటం ఆంజనేయుడికి ఎంతగానో నచ్చింది.సంతృప్తినీ కలిగించింది.

అందుకే అలాంటి రంగులో ఉన్న సింధూరాన్ని అంజన్నకు పూస్తే.ఆనాటి సంఘటన మదిలో మెదిలో ఆనందంతో పరవశించిపోతాడట.

అందుకే ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఇష్టమట.అంతే కాదు ఎరుపు రంగు పరాక్రమకు, త్యాగానికి, పవిత్రతకూ సంకేతం.

అర‌గంట‌లో పాదాల‌ను తెల్ల‌గా మార్చే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ ఇదే!

అందుకే స్వామి వారికి ఎరపు రంగు అంటే చాలా ఇష్టం.

What Is The Reason Behind Anjaneya Swamy Sindhur, Anajnaya Swami , Sindura, Devo
Advertisement

అందుకే ఎవరూ ఆంజనేయ స్వామికి పూజ చేసుకున్నా సింధూరాన్ని కచ్చితంగా పూయిస్తారు.భక్తులు కూడా నుదిటన సింధూరాన్ని పెట్టుకుంటారు.అలా పెట్టుకున్నా, ఆంజనేయ స్వామిని తలుచుకున్నా మన లోపల ఉన్న భయం, బాధ పోయి సంతోషంగా ఉంటామని భక్తుల నమ్మకం.

తాజా వార్తలు