ఆంజనేయ స్వామి ఎప్పుడూ నమస్కరిస్తూనే కనిపిస్తాడు ఎందుకు?

భారతదేశంలోని ప్రతీ రాష్ట్రంలోని పల్లెలు, గ్రామాలు, పట్టణాల్లో మనకు ఒక్కటైనా ఆంజనేయ స్వామి గుడి కన్పిస్తుంది.దాదాపుగా ఆంజనేయ స్వామి గుడి లేని గ్రామాలే ఉండవు.

అయితే చాలా వరకు రాతి విగ్రహాలు ఉంటాయి.అలాగే మామూలు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది.

 WHAT IS THE REASON BEHIND ALWAYS ANJANEYA SWAMY APPEAR TO BE BOWING Details, A

మనం ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజ చేసే ఈ ఆంజనేయ స్వామి మనకు ఎప్పడూ నమస్కరిస్తూనే కనిపిస్తాడు.అంటే ఆంజనేయ స్వామి విగ్రహం ఎప్పుడూ నమస్కార ముద్రలోనే కనిపిస్తుంది.

అలా ఎందుకు కనిపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.హిందూ పురాణాల ప్రకారం.

Advertisement

రావణ వధ అయ్యాక సీతారాములు వెళ్లేటప్పుడు ఆంజనేయ స్వామిని పిలిచి నీకేం కావాలో కోరుకొమ్మని అడిగారట.అప్పుడు ఆంజనేయ స్వామి నాకు నా మనస్సులో ఎలాంటి కోరికలూ లేవు.

కానీ ఏ రూపం చూసినా అందులో నీ రూపమే కన్పించాలి, ఏ శబ్దం విన్నా రామ నామమే వినిపించాలి, సీతారాముల కథే నేను వినాలి, నేనెక్కడ నమస్కారం చేసినా అది మీకే చెందేలా.ఈ భావం నాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించమని కోరాడట.

అందుకు సరేనన్న రాముడు.ఆంజనేయ స్వామి కోరికను మన్నించాడు.

ఇక అప్పటి నంచి ఆంజనేయ స్వామి ఎప్పుడూ సీతారాములకు నమస్కారం చేస్తున్నట్లు ఆయన విగ్రహాలు ఉంటాయి.ఆంజనేయుడి భక్తి, ప్రేమ అంతా సీతారాములపైనే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

హనుమంతుడికి శ్రీ రాముడికి నమస్కారం చేయడం అంటే చాలా ఇష్టమట.అందుకే మనం చూసే చాలా విగ్రహాల్లో ఆంజనేయ స్వామి నమస్కారం చేస్తూనే కనిపిస్తుంటాడు మనకు.

Advertisement

తాజా వార్తలు