ఏంటిది ..? టి. బీజేపీ నేతలకు క్లాస్ పీకిన అమిత్ షా 

వచ్చే లోక్ సభ ఎన్నికలపై బిజెపి సీరియస్ గానే దృష్టి పెట్టింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఘోర పరాజయం ఎదురు కావడం ఆ పార్టీ అగ్ర నేతలకు ఇంకా మింగుడు పడటం లేదు.

 What Is T. Amit Shah Who Has Given Class To Bjp Leaders , Amith Sha, Tela-TeluguStop.com

అన్ని జాగ్రత్తలు తీసుకున్న, విస్తృతంగా ప్రచారం నిర్వహించినా, ప్రజలకు దగ్గరయ్యేందుకు ఎన్ని రకాల హామీలు ఇచ్చినా, కేవలం ఎనిమిది స్థానాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలవడంతో బిజెపి అగ్ర నేతలు డీలపడ్డారు.దీంతో లోక్ సభ ఎన్నికల్లో నైనా బిజెపి సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు.

ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే సమయం ఉండడంతో, తెలంగాణ బిజెపి నాయకులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు .అన్ని లోక్ సభ స్థానాల్లోనూ అభ్యర్థులను పోటీకి దించే ఆలోచనతో ఉన్నారు.అలాగే సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానం నుంచి మళ్లీ టికెట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

Telugu Amith Sha, Brs, Central, Congress, Kishan Reddy, Loksabha, Mp, Telangana

ఇదిలా ఉంటే పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంపై అమిత్ ( Amith sha )చాలా సీరియస్ గానే ఉన్నారు.ఈ మేరకు తెలంగాణ బీజేపీ నాయకులకు గట్టిగానే ఆయన క్లాస్ పీకారు.తరుచుగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ.

పార్టీకి నష్టం చేయవద్దని, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసే ఎక్కువ స్థానాల్లో బిజెపి అభ్యర్థులు గెలిచే విధంగా పార్టీ నేతలు అంతా కృషి చేయాలని అమిత్ క్లాస్ పీకారు.నేతల మధ్య ఉన్న విభేదాలు, గ్రూపు రాజకీయాలే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమికి కారణాలని, ఈ తరహా పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకుండా చూడాలని అమిత్ సూచించారు.

Telugu Amith Sha, Brs, Central, Congress, Kishan Reddy, Loksabha, Mp, Telangana

బిజెపి( BJP ) సిట్టింగ్ ఎంపీలు ఉన్న నాలుగు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయంపై ఆరా తీశారు.ఈరోజు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన అమిత్ షా అక్కడినుంచి నోవా టెల్ కు చేరుకున్నారు.అక్కడ పార్టీ కీలక నేతలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొనారు.ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly elections ) ఓటమికి దారితీసిన పరిస్థితులు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే విషయాల పైన పార్టీ నాయకులతో ప్రధానంగా చర్చించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube