సప్త వ్యసనాలు అంటే ఏమిటో తెలుసా?

మనలో మంచి గుణాలు ఉన్నట్టుగానే కొందరిలో ఈ చెడ్డ వ్యసనాలు ఉంటాయి.పొరపాటున ఏ మనిషైనా కూడా దుర్వ్యసనాలకు అలవాటు పడితే తన జీవితంలో బాగుపడలేదు.

ఈ వ్యసనాలకు లోనై జీవితాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.ఈ కాలంలోనే కాదు పురాణాలలో కూడా ఇటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి కొందరు రాజ్యాలను కోల్పోగా, మరికొందరు అడవుల పాలయ్యారు.

ఈ దుర్వ్యసనాలు 7 మనిషి జీవితాన్ని నిలువెల్ల నాశనం చేస్తాయి.మరి ఆ వ్యసనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.1) ఇతర స్త్రీల పై వ్యామోహం:ఏకాలంలోనైనా ఒక మనిషిని పాతాళానికి తొక్కేసే అలవాటు ఇది.రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించి చివరికి రాజ్యాన్ని, ప్రాణాలను కూడా కోల్పోయాడు.ఇతర స్త్రీల పై వ్యామోహ పడేవాడు ఎప్పటికీ బాగుపడు అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.2) జూదం:జూదం ఎంతో మందిని ఎన్నో కష్టాలకు గురి చేస్తోంది.పూర్వం ధర్మరాజు అంతటివాడే జూదం ఆడి రాజ్యాన్ని కోల్పోవడమే కాకుండా తన తమ్ముళ్ళు వారి భార్యలను కూడా ఎన్నో కష్టాలు పాలు చేశాడు.3

) మద్యపానం:

మద్యపానం ఈ వ్యసనం వల్ల ఎంతో మంది కుటుంబాలు చిందరవందరగా మారిపోతాయి.ఇక పూర్వకాలంలో మద్యపానానికి మంచి ఉదాహరణగా శుక్రాచార్యుడిని చెప్పవచ్చు.

శుక్రాచార్యుడికి మృతసంజీవని గురించి తెలియడంతో చనిపోయిన రాక్షసులందరినీ బ్రతికించేవాడు.చివరికి మద్యం మత్తులో కచుడు చితాభస్మం కలుపుకొని శుక్రుడు తాగాడు.

What Is Seven Addictions Seven Addictions, Health, Devotional, Good Qualities,
Advertisement
What Is Seven Addictions Seven Addictions, Health, Devotional, Good Qualities,

4) వేట:

వేట కూడా సప్తవ్యసనాలలో ఒకటి.పూర్వం దశరథ మహారాజు వేట కోసం వెళ్లి నీటి శబ్దాన్ని బట్టి శ్రవణ కుమారుని చంపుతాడు.అతనికి తెలియని పాపమైన శ్రవణుడు తల్లిదండ్రుల శాపానికి దశరథుడు గురై తన కొడుకు దూరమై అతనిని కలవరిస్తూ మరణిస్తాడు.

What Is Seven Addictions Seven Addictions, Health, Devotional, Good Qualities,

5) కఠినంగా మాట్లాడటం:ఇందుకు మంచి ఉదాహరణగా దుర్యోధనుడిని చెప్పవచ్చు.దుర్యోధనుడు పాండవులను దుర్భాషలాడి ఎలాంటి పరిస్థితికి చేరుకున్నాడు మన అందరికీ తెలిసిందే.

6) కఠినంగా దండించడం: దీనికి కూడా దుర్యోధనుడి మంచి ఉదాహరణ.దుర్యోధనుడు తన తండ్రి మేనమామను బందిఖానాలో బంధించి వారిపట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించేవాడు.అతని పెట్టిన కొన్ని మెతుకులు తింటూ దుర్యోధనుడు చెంతకు చేరుకున్నాడు.

దుర్యోధన దగ్గరే ఉన్నట్లు నటించి కౌరవులు వందమంది నాశనానికి కారకుడయ్యాడు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

7) డబ్బు:ఇక ఈ డబ్బు అనే వ్యసనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా దానిని విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు.డబ్బు వ్యసనం ఎన్నో ప్రమాదాలకు దారి తీస్తుంది.

Advertisement

తాజా వార్తలు