YS Sharmila Jagan : ఇలా జరగబోతోందా ఏంటి ? షర్మిల జగన్ కు మేలు చేస్తారా ? 

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో అదే పనిగా వైసిపి ప్రభుత్వం పైన,  సీఎం జగన్ పైన( CM Jagan ) విమర్శలతో విరుచుకుపడుతున్నారు షర్మిల.

తన సోదరుడు జగన్ ను టార్గెట్ చేసుకుని షర్మిల( YS Sharmila ) చేస్తున్న వ్యాఖ్యలు జగన్ కు  ఇబ్బందికరంగా మారాయి.

షర్మిల చేస్తున్న వ్యాఖ్యలకు అనే సందర్భంలో టిడిపి, జనసేన సైతం మద్దతు పలికాయి.జగన్ వదిలిన భాణం తిరిగి జగన్ కే గుచ్చుకుంటుంది అంటూ సెటైర్లు ఈ రెండు పార్టీలు వేస్తున్నాయి.

టిడిపి, జనసేన పొత్తుతోనే ముందుకు వెళ్ళబోతున్నాయి .ఈ రెండు పార్టీలు మొదటి విడత అభ్యర్థుల జాబితాను నేడు విడుదల చేశాయి.ఇక బీజేపీ కూడా ఈ కూటమిలో కలిసే అవకాశం ఉండడంతో,  ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారబోతున్నాయి.

ఎన్డీఏ కూటమిలో టిడిపి( TDP ) చేరబోతుండడంతో , వామపక్షాలు అటువైపు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.దీంతో వారు కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్ధమవుతున్నారు.షర్మిల తో సిపిఐ,  సీపీఎం  నాయకులు సమావేశం అయ్యారు.

Advertisement

కాంగ్రెస్ సిపిఐ ,సిపిఎం పార్టీలతో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు .వీరితో పాటు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన పార్టీ కూడా కలవబోతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే వైసిపి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకూడదు అనే ఉద్దేశంతోనే టీడీపీ, జనసేన పొత్తు( TDP Janasena Alliance ) పెట్టుకున్నాయని పదేపదే చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ,( Pawan Kalyan ) చంద్రబాబుకు( Chandrababu ) ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలేలా కనిపిస్తోంది.టిడిపి, జనసేన ,బిజెపి కలిసి పోటీ చేస్తే వామపక్ష పార్టీలు, జేడీ లక్ష్మీనారాయణ పార్టీతో కలిసి కాంగ్రెస్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది .దీంతో కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉంటుంది.అదే జరిగితే టిడిపి ,జనసేన కూటమికి ఎదురయ్యే ఇబ్బందులు చాలానే ఉంతయిం అంతిమంగా ఇది వైసీపీకి ఎక్కువ మేలు చేకూరుస్తుంది.

ఇటీవల కాలంలో కాంగ్రెస్( Congress ) గ్రాఫ్ కూడా ఏపీలో పెరిగింది .ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా,  ఊహించని విధంగా స్పందన వచ్చింది.కాంగ్రెస్ తో పాటు జేడి లక్ష్మీనారాయణ పార్టీ, సిపిఐ ,సిపిఎం లు కలిసి పోటీ చేయబోతూ ఉండడంతో ఆ ప్రభావం కచ్చితంగా చాలా నియోజకవర్గాలు, జిల్లాల్లో కనిపిస్తోంది.

అదే జరిగితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశలకు గండి పడినట్టే.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు