'డంకీ' అంటే ఇంత అర్ధం ఉందా.. వివరించిన షారుఖ్ ఖాన్!

బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ( Shah Rukh Khan ) కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది అనే చెప్పారు.ఒకటి కాదు ఏకంగా రెండు వెయ్యి కోట్ల ప్రాజెక్టులను అందుకుని బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసారు.

 What Is Dunki Shah Rukh Khan Reveals Real Meaning, Dunki Movie, Jawan , Dunk-TeluguStop.com

పఠాన్ సినిమాతో వచ్చిన షారుఖ్ కు అదిరిపోయే హిట్ దక్కింది.ఇక ఈ మధ్యనే ‘జవాన్’( Jawan ) సినిమాతో వచ్చి మరో హిట్ అందుకున్నాడు.

వరుసగా రెండు వెయ్యి కోట్ల ప్రాజెక్టులను అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇదే జోష్ లో ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు షారుఖ్.మరి షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన మూవీ ”డంకీ”.( Dunki Movie ).ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారుఅన్ని ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడంతో సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగి పోతున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించగా ‘డంకీ’ అంటే అర్ధం ఏంటి అని ఒక ఫ్యాన్ అడుగగా షారుఖ్ ఖాన్ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పుకొచ్చారు.

డంకీ అంటే అనుమతి లేకుండా దేశ సరిహద్దులు దాటడాన్ని గాడిద జర్నీ అంటారు.పంజాబీలో దీనిని డంకీ అంటారు అంటూ షారుఖ్ సమాధానం చెప్పారు.దీనికి ఇంత అర్ధం ఉందా అంటూ ఆడియెన్స్ తెగ చర్చించు కుంటున్నారు.కాగా బాలీవుడ్ బడా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ( Rajkumar Hirani) తెరకెక్కిస్తున్న ”డంకీ” సినిమాలో విక్కీ విశాల్ కూడా కీ రోల్ పోషిస్తున్నాడు.

అలాగే ఈ మధ్యనే ట్రైలర్ తో దుమ్ములేపేసిన ఈ సినిమాలో తాప్సీ పన్ను( Taapsee ) హీరోయిన్ గా నటించింది.కాగా రాజ్ కుమార్ హిరానీ, గౌరీ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కానుండగా ప్రభాస్ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది.

దీంతో ఈ రెండు సినిమాల మధ్య భారీ పోటీ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube