బెల్లం, ల‌వంగాలు క‌లిపి తీసుకుంటే ఏం అవుతుందో తెలుసా?

భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే మసాలా దినుసుల్లో ల‌వంగాలు( Cloves ) ఒక‌టి కాగా.అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక సహజ చక్కెర పూర్వం బెల్లం.

బెల్లంలో( Jaggery ) పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోష‌కాలు మెండుగా ఉంటే.ల‌వంగాల్లో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ కె దండిగా ల‌భ్య‌మ‌వుతాయి.

అయితే బెల్లం, ల‌వంగాలు విడివిడిగా తీసుకోవ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంత ప్ర‌యోజ‌న‌క‌రమో తెలిసిందే.అయితే వీటిని క‌లిపి తీసుకున్నా బోలెడు లాభాలు చేకూర‌తాయి.

అవును, ఒక చిన్న బెల్లం ముక్క‌ను తీసుకుని ఒక‌టి లేదా రెండు ల‌వంగాల‌ను జోడించి మెల్లగా నమలి తినండి.జీర్ణాశయం ఆరోగ్యానికి( Digestive Health ) ఈ కాంబినేష‌న్ చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

Advertisement
What Happens When You Take Jaggery And Cloves Together Details, Jaggery, Cloves,

బెల్లం జీర్ణప్రక్రియను మెరుగుపరచి అజీర్తి, గ్యాస్‌ను తగ్గిస్తుంది.లవంగాలు జీర్ణసంబంధ సమస్యలను నివారించడంలో ఉపకరిస్తాయి.

What Happens When You Take Jaggery And Cloves Together Details, Jaggery, Cloves,

అలాగే గొంతు నొప్పితో( Sore Throat ) బాధ‌ప‌డుతున్న‌వారికి బెల్లం, ల‌వంగాల కాంబినేష‌న్ ఒక న్యాచుర‌ల్ మెడిసిన్‌లా పని చేస్తుంది.లవంగాలు యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉంటాయి, ఇది గొంతు ఇన్‌ఫెక్షన్లను తగ్గించడానికి సహాయపడతాయి.మ‌రియు బెల్లం గొంతు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.

గొంతు నొప్పి ఇబ్బంది పెడుతున్న పెడుతున్న‌ప్పుడు బెల్లం, ల‌వంగాలు క‌లిపి తీసుకుంటే సూప‌ర్ ఫాస్ట్ గా రిలీఫ్ పొందొచ్చు.అదే స‌మ‌యంలో ఇవి రెండూ చలికాలంలో శరీరాన్ని వెచ్చ‌గా ఉంచేందుకు స‌హ‌క‌రిస్తాయి.

What Happens When You Take Jaggery And Cloves Together Details, Jaggery, Cloves,

బెల్లం, ల‌వంగాలు కాంబినేష‌న్ దగ్గును( Cough ) తగ్గించడానికి మరియు శ్వాసనాళాలను శుభ్రం చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది.అంతేకాకుండా బెల్లం ర‌క్తాన్ని శుద్ధి చేస్తుంది.శరీరంలో డీటాక్సిఫికేషన్ ప్రోత్సహిస్తుంది.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

లవంగాల్లో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి, ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.అందువ‌ల్ల బెల్లం, ల‌వంగాలు క‌లిపి తీసుకుంటే బాడీ డీటాక్స్ అవ్వ‌డ‌మే కాకుండా ఇమ్యూనిటీ ప‌వ‌ర్ కూడా పెరుగుతుంది.

Advertisement

ఈ రెండింటిలోనూ ఐర‌న్ కంటెంట్ ఉండ‌టం వ‌ల్ల ర‌క్త‌హీన‌త నివార‌ణ‌కు సైతం ఇవి అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

తాజా వార్తలు