ఒక‌సారి వాడిన వంట నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వాడితే ఏం అవుతుంది?

దాదాపు అంద‌రి వంటింట్లో ఉండేది వంట నూనె.( Oil ) రోజూవారీ వంట‌ల్లో ఆయిల్ ఎంత ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే వృధా ఖ‌ర్చులు త‌గ్గించ‌డానికి చాలా మంది ఒక‌సారి వాడిన వంట నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వాడుతుంటారు.ముఖ్యంగా డీప్ ఫ్రై( Deep Fry ) వంట‌కాలు చేసిన‌ప్పుడు పాన్‌లో చాలా నూనె మిగిలి ఉంటుంది.

ఈ నూనెను ఓ డబ్బాలో వేసి మళ్ళీ ఫ్రై చేయడానికో లేదా కూరల్లోకో వాడేస్తూ ఉంటారు.అస‌లు ఒక‌సారి వాడిన వంట నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వాడొచ్చా? అలా వాడితే ఏం అవుతుంది? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.వాస్త‌వానికి ఒక‌సారి వాడిన వంట నూనెను( Cooking Oil ) మ‌ళ్లీ మ‌ళ్లీ వాడ‌కూడ‌దు.

వంట నూనెను ఎక్కువసార్లు వేడి చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్‌లు పెరుగుతాయి, ఇవి గుండె జబ్బులకు( Heart Diseases ) దారి తీస్తాయి.అలాగే ఎక్కువ‌సార్లు హీట్ చేయ‌డం వ‌ల్ల వంట నూనె ఆక్సిడైజ్ అయి హానికరమైన సంయోగాలును ఉత్ప‌త్తి చేస్తుంది.

Advertisement
What Happens If You Reuse Once-used Cooking Oil Details, Cooking Oil, Toxic Che

ఇది క్యాన్సర్( Cancer ) ముప్పును పెంచుతుంది.

What Happens If You Reuse Once-used Cooking Oil Details, Cooking Oil, Toxic Che

ఒక‌సారి వాడిన వంట నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వాడితే.ఆ నూనె కమ్మదనాన్ని కోల్పోయి, ఆహారం రుచిని త‌గ్గించేస్తుంది.అలాగే వంట నూనెను రీయూజ్ చేయ‌డం వ‌ల్ల అందులోని ఓమెగా-3, విటమిన్ ఇ, విటమిన్ ఎ వంటి పుష్టికరమైన పోషకాలు పూర్తిగా తొల‌గిపోతాయి.శరీరానికి మేలు చేసే మంచి కొవ్వు ఆమ్లాలు హాని చేసే ఫ్యాట్స్‌గా మారతాయి

What Happens If You Reuse Once-used Cooking Oil Details, Cooking Oil, Toxic Che

వంట నూనెను ఎక్కువసార్లు వేడి చేసినప్పుడు ఏక్రోలిన్ అనే రసాయనం ఏర్పడుతుంది, ఇది శ్వాసకోశ సమస్యలకు( Respiration Problems ) కారణమవుతుంది.ఒక‌సారి వాడిన వంట నూనెను మ‌ళ్లీ మ‌ళ్లీ వాడితే జీర్ణకోశ సమస్యలు త‌లెత్తుతాయి.గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి వంటివి బాగా ఇబ్బంది పెడ‌తాయి.

కాబ‌ట్టి, ఒక‌సారి వాడిన వంట నూనెను రీయూజ్ చేయ‌కూడ‌దు.అందులోనూ మాంసం ఫ్రై చేసిన నూనె, హై టెంపరేచర్‌లో ఫ్రై చేసిన నూనె మ‌రియు వాసన, రంగు మారిన నూనెను ఒకసారి వాడాక క‌చ్చితంగా పారేయాలి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు