ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో పుచ్చ‌కాయ తింటే ఏం అవుతుందో తెలుసా?

మాతృత్వం అనేది ప్ర‌తి మ‌హిళ‌కు ఒక గొప్ప వ‌రం లాంటిది.అందుకే వివాహం అయిన ప్ర‌తి స్త్రీ మాతృత్వంలోని మధురానుభూతిని పొందేందుకు ఆశ ప‌డుతుంటుంది.

ఇక కోరుకున్న‌ట్టుగానే గ‌ర్భం పొందితే.వారిలో ఉత్సాహం, ఆనందం వెల‌క‌ట్ట‌లేనిది.

అయితే గ‌ర్భం పొంద‌డ‌మే కాదు.ఆ స‌మ‌యంలో ఎన్నో జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి.

ముఖ్యంగా ఆహారంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి.అయితే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో కొంద‌రు కొన్ని కొన్ని పండ్ల‌ను తీసుకోవ‌డానికి సంకోచిస్తుంటారు.

Advertisement
What Happens If Pregnant Women Eat Watermelon, Pregnant Women, Pregnants, Healt

అలాంటి పండ్ల‌లో పుచ్చ‌కాయ ఒక‌టి.ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో పుచ్చ‌కాయ తింటే.మ‌ధుమేహం వ‌స్తుంద‌ని చాలా మంది భావ‌న‌.

కానీ, నిజానికి ఆ స‌మ‌యంలో పుచ్చ‌కాయ తింటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.సాధార‌ణంగా ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో చాలా మంది మార్నింగ్ సిక్ నెస్ తో ఇబ్బంది ప‌డుతుంటారు.

అయితే పుచ్చ‌కాయ తీసుకోవ‌డం వ‌ల్ల.అందులో ఉండే పోష‌క విలువ‌లు శ‌రీరానికి ఎన‌ర్జీని అందిస్తాయి.

మ‌రియు మార్నింగ్ సిక్ నెస్‌ను దూరం చేస్తాయి.

What Happens If Pregnant Women Eat Watermelon, Pregnant Women, Pregnants, Healt
జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

అలాగే ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో పుచ్చ‌కాయ తీసుకంటే.బాడీ డీహైడ్రేష‌న్‌కు గురి కాకుండా ఉంటుంది.ప్రీమెచ్యుర్ బర్త్‌ను కూడా నివారిస్తుంది.

Advertisement

ఇక ప్రెగ్నెన్సీ స‌మ‌యంలో కాళ్లు, పాదాలు, చేతులు త‌ర‌చూ వాపులు వ‌స్తుంటాయి.అయితే పుచ్చ‌కాయ తీసుకోవ‌డం వ‌ల్ల వాపులు రావ‌డం తగ్గుతుంది.

గ‌ర్భిణీలు ఎక్కువ‌గా ఎసిడిటీ, గ్యాస్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డ‌తాయి.అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో పుచ్చ‌కాయ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఇక పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల్ల చ‌ర్మం కూడా య‌వ్వ‌నంగా, కాంతివంత‌గా ఉంటుంది.కాబ‌ట్టి, ఎలాంటి భ‌యం లేకుండా పుచ్చ‌కాయ‌ను ప్రెగ్నెన్సీ స‌మ‌యంతో తినొచ్చు.

కానీ, అతిగా మాత్రం ఎప్పుడూ తిన‌కూడ‌దు.అలా చేస్తే పుచ్చ‌కాయ‌లో ఉండే చక్కెర కంటెంట్ మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచుతుంది.

ఫలితంగా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.

తాజా వార్తలు