మధుమేహం ఉన్నవారు చింతపండును తీసుకుంటే ముప్పే.. జర జాగ్రత్త!

చింత‌పండు.దీని గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో నిత్యం వాడే వాటిల్లో చింతపండు ఒకటి.

చ‌ట్నీలు, పులుసులు, చారు వంటి వాటిల్లో చింత‌పండును త‌ప్ప‌ని స‌రిగా వాడుతుంటారు.

తీపి పులుపు రుచులతో కలగలిసి ఉండే చింతపండులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.అవి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి.

చింతపండును తీసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు సైతం లభిస్తాయి.కానీ అందరికీ కాదు.

Advertisement

కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు చింత పండును చాలా అంటే చాలా మితంగా తీసుకోవాలి.ఈ లిస్టులో మొదటగా చెప్పుకోవాల్సింది మధుమేహులు.

అవును, మధుమేహం ఉన్నవారు చింతపండును అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు నిపుణులు.చింతపండు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువ అవుతుంది.

అలా అని చింతపండును పూర్తిగా ఎవైడ్ చేయాల్సిన అవసరం లేదు.

మితంగా తింటే ఏం కాదు.కానీ చింతపండును అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర సమతుల్యత దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.కాబట్టి మధుమేహం ఉన్నవారు చింతపండుతో జ‌ర జాగ్రత్త.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వీలైనంత వరకు చింతపండు పరిమితంగా తీసుకోండి.అలాగే దంత సమస్యలతో బాధపడుతున్న వారు కూడా చింతపండును చాలా తక్కువగా తీసుకోవాలి.

Advertisement

దంతాల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు చింతపండును అధికంగా వాడితే ఆయా సమస్యలు మరింత తీవ్ర తరంగా మారతాయి.అలాగే దంతాల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది.గొంతు నొప్పి, గొంతు వాపు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో సతమతం అవుతున్న వారు కూడా చింతపండును కొద్ది రోజులు పూర్తిగా ఎవైడ్ చేయాలి.

ఎందుకంటే చింతపండు గొంతు సంబంధిత సమస్యలను మరింత పెంచుతాయి.ఇక మిగిల‌న వారు చింత‌పండును ఎలాంటి భ‌యం లేకుండా తీసుకోవ‌చ్చు.బ‌రువు త‌గ్గించ‌డానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డానికి చింత‌పండు గ్రేట్ గా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రెన్నో ఆరోగ్య లాభాల‌ను సైతం అందిస్తుంది.

తాజా వార్తలు