రాత్రిపూట బీట్ రూట్ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!

బీట్ రూట్ దీని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.దుంప జాతికి చెందిన ఈ బీట్ రూట్‌లో ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉన్నాయి.

పెద్ద‌లు, పిల్ల‌లు అనే తేడా లేకుండా అంద‌రూ తిన‌గ‌లిగే ఆహారాల్లో బీట్ రూట్ ఒక‌టి.బీట్ రూట్ ధ‌ర కూడా ద‌క్కువ‌గానే ఉంటుంది.

పైగా ఆరోగ్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.అందుకే చాలా మంది బీట్ రూట్‌తో ర‌క‌ర‌కాల రెసిపీస్ త‌యారు చేసుకుని తింటుంటారు.

కొంద‌రు బీట్ రూట్‌ను డైరెక్ట్‌గా కూడా తీసుకుంటారు.ఎలా తీసుకున్నా బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Advertisement
What Happens If Eat Beetroot At Night! Eat Beetroot At Night, Eat Beetroot, Beet

అయిన‌ప్ప‌టికీ రాత్రి వేళ మాత్రం బీట్ రూట్‌ను తీసుకోరాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.సాధార‌ణంగా డైటింగ్ చేసే వాళ్లు నైట్ టైమ్ రైస్‌కు బ‌దులుగా పండ్లు లేదా కూర‌గాయ‌లు తీసుకుంటుంటారు.

ఈ క్ర‌మంలోనే కొంద‌రు బీట్ రూట్‌ను కూడా నైట్ డైట్‌లో చేర్చుకుంటారు.అయితే రాత్రి వేళ బీట్ రూట్‌ను తీసుకోవ‌డం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాద‌ట‌.

ఎందుకూ అంటే రాత్రి పూట బీట్ రూట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌క్ష‌ణ‌మే పెరిగిపోతాయి.ఇలా క్ర‌మంగా జ‌రిగితే మ‌ధుమేహం బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

ఇక మధుమేహం ఉన్న వారైతే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాత్రి పూట బీట్ రూట్ తిన‌రాద‌ని అంటున్నారు.అలాగే రక్తపోటు స్థాయిలని తగ్గించే గుణం బీట్ రూట్‌కు ఉంది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అందులోనూ నైట్ టైమ్ బీట్ రూట్ తీసుకుంటే మ‌రింత వేగంగా ర‌క్త‌పోటును త‌గ్గిస్తుంది.

What Happens If Eat Beetroot At Night Eat Beetroot At Night, Eat Beetroot, Beet
Advertisement

అధిక రక్తపోటు ఉన్న వారికి ఇది వరమే.కానీ, లో బీపీ ఉన్న వారికి మాత్రం ఇది శాతం.అందువ‌ల్ల, రాత్రి వేళ బీట్ రూట్ తీసుకోరాదు.

ఇక రాత్రి పూట బీట్ రూట్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఉద‌యానికి కొంద‌రిలో వికారం, వాంతులు వంటి స‌మ‌స్య‌లు కూడా ఏర్ప‌డ‌తాయి.అలాగే బీట్ రూట్‌ను అతిగా కూడా తీసుకోరాదు.

ఇలా చేయ‌డం వ‌ల్ల కిడ్నీలో రాళ్లు ఏర్ప‌డ‌టంతో పాటు ప‌లు ఆనారోగ్య స‌మ‌స్య‌లను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

తాజా వార్తలు