సమంతా-సిద్ధార్ లవ్ బ్రేకప్ కి ముందు ఏం జరిగింది !

ప్రస్తుతం సౌత్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి సమంత.గడిచిన దశాబ్ద కాలంగా తను మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది.

సినీ కెరీర్ పరంగా, లేదంటే వ్యక్తిగతంగా.ఏదో ఒకరీతిలో మీడియాకు స్టప్ అవుతుంది.

ఆమె ఏం చేసిన మీడియాలో హెడ్ లైన్ అవుతోంది.సిద్ధార్థ్ తో ప్రేమాయణం, శ్రీకాళహాస్తిలో రాహుకేతు పూజలు, స్టార్ హీరోయిన్ వరుస హిట్లు, అక్కినేని చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఒకటేమిటీ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో మస్త్ బిజీ అయ్యింది.పుష్ప సినిమాలో తను చేసిన ఐటెం సాంగ్ తో మరింత పాపులర్ అయ్యింది.

Advertisement

అంగాంగ ప్రదర్శనతో యువతను కట్టిపడేసింది.ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ సినిమా పరిశ్రమల్లో బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది.

హాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది.ప్రస్తుతం తను, తన మాజీ ప్రియుడు సిద్ధార్థ్ కలిసి నటించిన జబర్దస్త్ సినిమాకు 9 ఏండ్లు నిండాయి.

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సిద్దార్థ్ తో సమంతా ప్రేమలో పడింది.వీరిద్దరు కలిసి శ్రీకాళహాస్తిలో రాహు, కేతు పూజలు కూడా చేయించుకున్నారు.

అప్పట్లో ఈ వార్తలు సంచలనం అయ్యాయి.వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది అనుకున్నా.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఏవేవో కారణాలతో అది సాధ్యం కాలేదు.

Advertisement

అప్పట్లో వీరు నటించిన జబర్దస్త్ సినిమా చాలా వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. సిద్దార్థ్, సమంతాకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండటం మూలంగా అలా మొదలైంది సినిమాతో మంచి హిట్ అందుకున్న నందినీ రెడ్డి.ఈ సినిమాను తెరకెక్కించింది.

బెల్లంకొండ సురేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక.

అచ్చం బ్యాండ్ బాజా బరాత్ సినిమాకు కాపీగా ఉందని విమర్శలు వచ్చాయి.నందినీ రెడ్డి ఆ సినిమాను ఉన్నది ఉన్నట్లు దింపారని టాక్ వచ్చింది.

ఆ తర్వాత బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాపై కోర్టుకు వెళ్లారు ఈ సినిమాను టీవీల్లో, డీవీడీల్లో రిలీజ్ చేయకూడదని కోర్డు తీర్పు ఇచ్చింది.అయితే బెల్లంకొండ ఈ విషయాన్ని బయట సెటిల్ చేసుకున్నాడు.

ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికే సిద్దార్థ్-సమంతా విడిపోవడం విశేషం.

తాజా వార్తలు