ప్రిస్క్రిప్షన్‌పై ఉండే Rxకి అర్థం ఏమిటో తెలుసా?

వైద్యులు మందులను రాసే ప్రిస్క్రిప్షన్‌పై అనేక రకాల చిహ్నాలు కనిపిస్తాయి.వాటికి ప్రత్యేక అర్థం ఉంది.

అటువంటి చిహ్నాలలో Rx ఒకటి.దీని అర్థం ఏమిటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రిస్క్రిప్షన్‌ ఎడమ వైపున Rx అని కనిపిస్తుంది.

What Does Rx Mean On Prescription Drugs-ప్రిస్క్రిప్ష

ఇది లాటిన్ భాష పదం.దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. Rx అనే ఈ లాటిన్‌ పదానికి తీసుకోవడం అని అర్థం.

అంటే ప్రిస్క్రిప్షన్‌పై డాక్టర్ ఏది రాస్తున్నారో దానిని బాధితుడు తీసుకోవాలని దాని అర్థం.మెంటల్ ఫ్లాస్ నివేదిక ప్రకారం.

Advertisement

ప్రిస్క్రిప్షన్‌లో Rxని సూచించిన అనంతరం రోగి తీసుకోవాల్సిన మందులు, జాగ్రత్తల గురించి డాక్టర్ రాస్తారు.Drug.com తెలిపిన వివరాల ప్రకారం Rxతో పాటు ప్రిస్క్రిప్షన్‌లో అనేక ఇతర కోడ్ పదాలు కూడా కనిపిస్తాయి.

ఉదాహరణకు ఏదైనా ఔషధంతో ఏఎంపీ అని రాసినట్లయితే అది రాత్రి భోజనానికి ముందు తీసుకోవాలి.ఏక్యూ అని రాసినట్లయితే దానిని నీటితో తీసుకోవాలి.

బీఐడీ అంటే ఆ ఔషధం రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.ఇంతేకాదు అనేక మందులను సూచించడంలో కూడా చిన్నపాటి కోడ్‌లను ఉపయోగిస్తారు.

ఉదాహరణకు, బీసీపీ అనేది జనన నియంత్రణ మాత్రల కోసం ఉపయోగిస్తారు.ఎఎస్ఏ అనేదానిని ఆస్పిరిన్ కోసం ఉపయోగిస్తారు ఇంతేకాకుండా ఇయర్ డ్రాప్ కోసం ఏయూ షార్ట్ ఫారమ్ ఉపయోగిస్తారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

అంటే డ్రాప్‌ను రెండు చెవులలో ఉపయోగించాలి.అలాగే వివిధ పరీక్షలకు కూడా ఇదే విధమైన సంక్షిప్త రూపం ఉపయోగిస్తారు.

Advertisement

ఉదాహరణకు సీబీసీ అనేదానిని రక్త గణన కోసం ఉపయోగిస్తారు.అదే సమయంలో, ఛాతీ ఎక్స్-రే కోసం సీఎక్స్‌ఆర్, గుండె సంబంధిత వ్యాధుల కోసం సీవీ షార్ట్ ఫారమ్ రాస్తారు.

" autoplay>

తాజా వార్తలు