భారీగా పెరుగుతున్న నోటి క్యాన్స‌ర్ బాధితులు.. ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయంటే?

నోటి క్యాన్స‌ర్‌(ఓర‌ల్ క్యాన్స‌ర్‌).ఇటీవ‌ల రోజుల్లో ఈ మ‌హ‌మ్మారి బాధితులు భారీగా పెరిగిపోతున్నారు.

ధూమ‌పానం, మ‌ద్యం సేవించ‌డం, పొగాకు లేదా పొగాకు ఉత్ప‌త్తుల‌ను న‌మ‌ల‌డం, నోటి శుభ్ర‌త లేక‌పోవ‌డం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఓర‌ల్ క్యాన్స‌ర్ బారిన ప‌డుతుంటారు.కార‌ణం ఏదైనా నోటి క్యాన్స‌ర్‌ను ముందే గుర్తించి జాగ్ర‌త్త ప‌డ‌కుంటే.

అది చెవి, ఊపిరితిత్తులు, మెదడుకు విస్తరించి మరణం సంభవించే అవకాశాల‌ను పెంచుతుంది.అందుకే నోటి క్యాన్స‌ర్‌ను తొలి ద‌శ‌లో ఉన్న‌ప్పుడే ప‌సిగ‌ట్టాల‌ని నిపుణులు చెబుతుంటారు.

అస‌లింత‌కీ నోటి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలు ఎలా ఉంటాయి.? అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఓర‌ల్ క్యాన్స‌ర్ బారిన ప‌డ్డ‌వారిలో గొంతు మంట‌, గొంతు నొప్పి, నోట్లో తెలుపు-ఎరుపు మిళితమైన మచ్చలు ఏర్ప‌డ‌టం, నోట్లో పుండ్లు ప‌డి త్వ‌ర‌గా త‌గ్గ‌క‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి.

Advertisement

అలాగే త‌ర‌చూ గొంతు బొంగురు పోవ‌డం, దవడల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆహారాన్ని నమలడానికి.మింగడానికి క‌ష్ట‌తరంగా ఉండ‌టం, లాలాజలం అధికంగా ఊరడం, నోటి దుర్వాసన వంటివి నోటి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలే.

తలనొప్పి, నాలుక ఎప్ప‌టిక‌ప్పుడు మొద్దుబారిపోవ‌డం, గొంతులో ఏదో ఇరుక్కున్నట్లుగా అనిపించడం, వినికిడి శక్తి లోపించ‌డం, తీవ్ర‌మైన చెవి పోటు, మాట్లాడటానికి అసౌక‌ర్యంగా ఉండ‌టం వంటి వాటిని కూడా నోటి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు.

ఇక పైన చెప్పిన ల‌క్ష‌ణాలు మీలో గ‌నుక ఉంటే అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కుండా మంచి వైద్యుడిని సంప్ర‌దించి త‌గిని టెస్ట్‌ల‌ను చేయించుకోవాలి.ఏ మాత్రం టెన్ష‌న్ ప‌డ‌కుండా మీలో క‌నిస్తున్న లక్ష‌ణాలు నోటి క్యాన్స‌ర్‌కు సంకేత‌మా.? కాదా.? అన్న‌ది నిర్థార‌ణ చేసుకోవాలి.అలా కాకుండా ల‌క్ష‌ణాల‌ను నిర్లక్ష్యం చేస్తూ ఇంట్లోనే కూర్చుంటే ప్రాణాలే రీస్క్‌లో ప‌డ‌తాయ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

సో.బీ కేర్ ఫుల్‌!.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement