హరీష్ కు ప్రమోషన్ వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటి ?

హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాలతో మంత్రి హరీష్ రావు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

ఎన్నికల బాధ్యతలు మొత్తం హరీష్ రావు పైన కెసిఆర్ వేయడంతో ఆయన సైతం గట్టిగానే కష్టపడ్డారు.

పెద్దఎత్తున ఇతర పార్టీల్లోని నాయకులను చేర్చుకోవడం తో పాటు,,  ఈటెల రాజేందర్ ను ఓడించేందుకు ఎన్నో రకాల ఎత్తుగడలు వేశారు.అయితే అవేమీ వర్కౌట్ కాలేదు.

ఫలితం టిఆర్ఎస్ కు అనుకూలంగా దక్కకపోవడంతో, దీనికి కారణం హరీష్ రావు అనే ప్రచారం జరిగింది.దీంతో పూర్తిగా హరీష్ రావు ను కేసీఆర్ పక్కన పెడతారని , ఇకపై ఆయనకు ప్రాధాన్యం ఉండదు అని అంతా భావించారు.

కానీ, దానికి భిన్నంగా హరీష్ రావు కు కేసీఆర్ బాగా ప్రాధాన్యం ఇచ్చారు.ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పనిచేస్తున్నారు.

Advertisement

ఆయనకు వైద్య ఆరోగ్యశాఖ ను కేటాయించారు.దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ తమిళిసై కూడా సంతకం చేశారు .ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఇదంతా హరీష్ ను హైలెట్స్ చేసేందుకు కాదని , ఆయనకు ప్రాధాన్యం తగ్గించేందుకు ఈ శాఖను అప్పగించారు అనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వారెవ్వరికి ఆ తరువాత రాజకీయంగా కలిసి రాలేదు.గతంలో ఇదే వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన తాడికొండ రాజయ్య వ్యవహారమే తీసుకుంటే , ఆయన టిఆర్ఎస్ అత్యధికంగా ప్రాధాన్యం పొందారు ఉపముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు.

అయితే ఆ తర్వాత టిఆర్ఎస్ లో ఆయన ప్రభావం బాగా తగ్గిపోవడం, ఆ తర్వాత పరిణామాల్లో ఆయన  అవమానకరంగా మంత్రి పదవి కోల్పోవడం ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం వంటి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి.

ఇక ఆయన తరువాత అదే శాఖను ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నిర్వహించారు.ఆయన ను రాజయ్య మాదిరిగానే అవమానకరంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు.ఆ తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం,  హుజురాబాద్ ఎన్నికలకు వెళ్లడం, మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడం వంటివి చోటు చేసుకున్నాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

ఇప్పుడు మళ్లీ అదే వైద్య ఆరోగ్య శాఖను హరీష్ రావు కు ఇస్తుండడంతో మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని టెన్షన్ హరీష్ వర్గంలో నెలకొంది.

Advertisement

తాజా వార్తలు