ఎడమ చేయి నొప్పి గుండె జ‌బ్బుల‌కే కాదు..వాటికీ సంకేత‌మే!

సాధార‌ణంగా గుండె పోటు వ‌చ్చే ముందు ఎడ‌మ చేయి తీవ్రంగా నొప్పి పుడుతుంటుంది.హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందు అత్య‌ధికంగా క‌నిపించే ల‌క్ష‌ణాల్లో ఇదీ ఒక‌టి.

అలా అని ఎడ‌మ చేయి నొప్పి వ‌చ్చినంత మాత్రాన ఖ‌చ్చితంగా గుండె పోటు వ‌స్తుంద‌నీ కాదు.ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా ఎడ‌మ చేయి నొప్పి ప‌డుతూ ఉంటుంది.

మ‌రి ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయ‌కుండా ఎడ‌మ చేయి నొప్పి పుట్ట‌డానికి కార‌ణాలు ఏంటీ.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.కంప్యూట‌ర్ల ముందు గంట‌లు త‌ర‌బ‌డి ప‌ని చేసే వారు స‌రైన భంగిమ‌లో కూర్చోకుంటే.

వారిలో ఎడ‌మ చేయి నొప్పి ఎక్కువ‌గా ఉంటుంది.అందు వ‌ల్ల‌, కూర్చునే పొజీష‌న్ క‌రెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి.

Advertisement
What Are The Causes Of Left Hand Pain! Left Hand Pain, Causes Of Left Hand Pain,

మ‌రియు వ‌ర్క్ చేసేటప్పుడు మ‌ధ్య మ‌ధ్య‌లో బ్రేక్ తీసుకోండి.త‌ద్వారా ఒత్తిడి పెర‌గ కుండా ఉంటుంది.

What Are The Causes Of Left Hand Pain Left Hand Pain, Causes Of Left Hand Pain,

శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జ‌ర‌గ‌క‌పోవ‌డానికీ ఎడ‌మ చేయి నొప్పి ఒక సంకేతంగా చెప్పుకోవ‌చ్చు.ర‌క్త ప్రసరణ పెర‌గాలంటే వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవాలి.ప్ర‌తి రోజూ చిన్న చిన్న‌ వ్యాయామాలు చేయాలి.

టీ, కాఫీలు తాగ‌డం త‌గ్గించాలి.ఉప్పు చాలా ప‌రిమితంగా త‌సుకోవాలి.

మ‌ద్య‌పానం అల‌వాటును మానుకోవాలి.పోష‌కాహారం తీసుకోవాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

రెగ్యుల‌ర్‌గా ఒక క‌ప్పు గ్రీన్ టీని తీసుకోవాలి.త‌ద్వారా ర‌క్త ప్ర‌స‌ర‌ణ పెరిగి.

Advertisement

ఎడ‌మ నొప్పి ద‌రి చేర‌కుండా ఉంటుంది.

అలాగే నిద్రించే భంగిమ సరిగ్గా లేకయినా ఎడ‌మ చేయి నొప్పి పుడుతుంది.గ్యాస్‌, అసిడిటీ వంటి సమస్య వల్ల కూడా ఎడ‌మ చేయి నొప్పి వ‌స్తుంది.అంతేకాదు, క్యాన్సర్ బాధితుల్లో కూడా ఎడమ చేయి నొప్పి ఉంటుంది.

వీరిలో కీమో థెరపీ మందులు మ‌రియు ఇత‌రిత‌ర కార‌ణాల వ‌ల్ల ఎడ‌మ చేయి త‌ర‌చూ నొప్పి ప‌డుతుంది.

తాజా వార్తలు