కళ్లకు కాటుక పెట్టుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!!

కాటుక క‌ళ్లు ఎంత అందంగా ఉంటాయో మాట‌ల్లో వ‌ర్ణించ‌లేనిది.అందుకే అమ్మాయిల కళ్ళ మీద కోట్ల కొద్దీ కవితలు ఉన్నాయి.

ఎంత చిన్న కళ్ళైనా రవ్వంత కాటుక పెడితే.అందం రెట్టింపు అవుతుంది.

కాటుక పెట్టుకోవ‌డం వ‌ల్ల అందం రెట్టింపు అవ్వ‌డ‌మే కాదు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.దుమ్ము, ధూళి ప్రభావాల నుంచి కాటుక కంటిని కాపాడుతుంది.

సూర్య కిరణాలు నేరుగా కళ్ళలోకి పడితే చాలా డేంజ‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే.అయితే, కాటుక పెట్టుకోవడం వల్ల అలాంటి సూర్య కిరణాల వల్ల కళ్ళకి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది.

Advertisement
What Are The Benefits Of Kajal For Eyes!! Benefits Of Kajal, Kajal, Eyes, Eye C

అలాగే కాటుక పెట్టుకోవ‌డం వ‌ల్ల కళ్లను తాజాగా మెరిసేలా చేస్తుంది.ఇక కాటుక ధరించడానికి మ‌రో ముఖ్యమైన కారణం కళ్లకు చల్లదనం.

నిద్ర బాగా ప‌ట్ట‌డానికి కూడా కాటుక ఉప‌యోగ‌ప‌డుతుంది.అంతేకాదు, కళ్లు ఏ ఆకారంలో ఉన్నా కాటుక పెట్టగానే ఆకర్షణీయంగా కనబడతాయి.

What Are The Benefits Of Kajal For Eyes Benefits Of Kajal, Kajal, Eyes, Eye C

అందుకే అమ్మాయిలు కాటుక ఖ‌చ్చితంగా పెట్టుకుంటారు.అయితే కాటుక విష‌యంలోనూ కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్త‌వానికి ఇటీవ‌ల కాలంలో కాటుకలలో కొన్ని కెమికల్స్ ఉపయోగిస్తున్నారు.అందుకే నాణ్యమైన కాటుక లేదా ఇంట్లో త‌యారు చేసుకున్న కాటుక‌ను వాడాలి.

కాలేజీ రోజుల్లో టాలీవుడ్ హీరోయిన్స్ ఎలా ఉండేవారు

కొంద‌రికి కాటుక ప‌డ‌క‌పోవ‌చ్చు.అలాంటి వారు కాటుక వాడినప్పుడు దురద పెట్టటం, కళ్ళు మంటగా అనిపిస్తే వెంటనే కాటుక వాడటం మానేయాలి.

Advertisement

ఇక కాటుక పెట్టుకునే ముందుకు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.ముఖంపై, కళ్లపై ఏమాత్రం తడిలేకుండా తుడుచుకోవాలి.

తరువాతే కాటుక పెట్టుకోవాలి.అలాగే కాటుక ఎక్కువ స‌మ‌యం పాటు ఉండాలంటే.

ముందుగా ముఖాన్ని కాళ్లపై ఐస్ క్యూబ్‌తో రబ్ చేయండి.ఆ తర్వాత కాటుక పెట్టుకుంటే.

ఎక్కువ స‌మ‌యం ఉంటుంది.

తాజా వార్తలు