కాలసర్ప దోషానికి నివారణ మార్గాలు ఏమిటి?

జాతక చక్రంలో పంచమ స్థానంలో రాహువు గాని కేతువు గాని ఉంటే మనకు కాల సర్ప దోషం ఉన్నట్లు.

అయితే కాల సర్ప దోషం కారణంగా సంతానం ఆలస్యం కావడం, సంతానం లేక పోవడం, అలాగే గర్భం వచ్చినా నిలవక పోవడం వంటి సమస్యలు వస్తుంటాయి.

తరచూ ఇలా జరిగితే.మనం వెంటనే వేద పండితులను కలిసి నివారణ చర్యల గురించి తెల్సుకుంటాం.

What Are Remedies For Kala Sarpa Dosham, Devotional, Kala Sarpa Dosham, Sarpa Do

ఏం చేసైనా సరే ఆ కాల సర్ప దోషాన్ని వదిలించుకోవాలని చూస్తాం.అయితే ఏం చేయడం వల్ల కాల సర్ప దోషం మనల్ని వదిలి పోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీకాళ హస్తి వెళ్లి రాహు, కేతు సర్ప దోష పరిహారం చేయించుకొని మినుములు, కందులు, ఉలవలు దానం చేయడం వల్ల కాల సర్ప దోషాన్ని దూరం చేసుకోవచ్చు.అలాగే దుర్గా దేవి, పాతాళ వినాయకుడిని పూజించడం వల్ల కూడా ఈ దోషాన్ని నివారించుకోవచ్చు.

Advertisement

బంగారం లేదా వెండితో నాగ పడగ చేయించి.ఏకాదశ రుద్రాభిషేకం తర్వాత  ఆ పడగను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా దోషం పోతుంది.

వెండితో సర్పాకార ఉంగరం చేయించి వేలికి ధరించడం, ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రంలో 108 ప్రదక్షిణలు చేసి దేవుడికి వెండి పడగను సమర్పించడం వల్ల కూడా కాల సర్ప దోషం పోతుంది.అలాగే కుజ, రాహు, కేతు గ్రహాలకు విడివిడిగా జపాలు చేయించి గ్రహ దానాలు చేయడం ద్వారా కాల సర్ప దోషం నివారణ అవుతుంది.

మంచి జరుగుతుంది.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..
Advertisement

తాజా వార్తలు