చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గ( Kuppam Assembly constituency) మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu) ముఖాముఖీ నిర్వహించారు.స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేష( Women Reservation )న్ కల్పించామని తెలిపారు.
మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలనే డ్వాక్రా సంఘాలను సైతం పెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు.ఆర్టీసీలో మహిళలకు ఉద్యోగాలు కల్పించామన్న చంద్రబాబు ఆడబిడ్డల ఆత్మ గౌరవం కాపాడాలని ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు.
మన ప్రభుత్వం వచ్చాక మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తానని వెల్లడించారు.ఆడబిడ్డల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని తెలిపారు.50 రోజుల తరువాత నాణ్యమైన మద్యం అందిస్తామన్న చంద్రబాబు సంపద సృష్టించి పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.దేశం గర్వపడేలా కుప్పం( Kuppam Assembly constituency )ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.