ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం.. : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటించారు.అయితే భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ప్రమాద తీవ్రతపై మంత్రి కేటీఆర్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్తినష్టం జరిగినా ఫర్వాలేదు కానీ ప్రాణ నష్టం జరగకూడదని చెప్పారు.

ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.హైదరాబాద్ నగరంలో 185 చెరువులు ఉన్నాయన్న మంత్రి కేటీఆర్ స్లూజెస్ బిగించామని తెలిపారు.

ఈనేపథ్యంలో వరద ప్రభావం లేకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా డిజాస్టార్ ఎన్ ఫోర్స్ మెంట్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయన్నారు.

Advertisement

స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఫలితాలు వస్తున్నాయని తెలిపారు.గతంలో వరద వచ్చిన ప్రాంతాల్లో ఇప్పుడు సమస్య లేదని చెప్పారు.

అలా అని ఎక్కడా సమస్య లేదని చెప్పడం లేదన్నారు.అక్కడక్కడ సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకుంటూ పోతున్నామని వెల్లడించారు.

ప్రజలకు 24 గంటల పాటు సేవ చేస్తున్నామని స్పష్టం చేశారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు