ఫేస్‌వాష్‌ను ముఖానికే కాదు..ఇలా కూడా వాడొచ్చ‌ని మీకు తెలుసా?

స్కిన్ కేర్ ప్రోడెక్ట్స్‌లో ఏవి కొన్నా కొన‌క పోయినా త‌మ స్కిన్‌కు సూట్ అయ్యే ఫేస్‌వాష్ ను మాత్రం త‌ప్ప‌కుండా కొనుగోలు చేస్తుంటారు.

అమ్మాయిలే కాదు అబ్బాయిలు సైతం ఫేస్ వాష్‌ను రెగ్యుల‌ర్‌గా యూజ్ చేస్తారు.

ఫేస్‌వాష్‌ను వాడ‌టం వ‌ల్ల చ‌ర్మంపై దుమ్ము, ధూళి, జిడ్డు, మ‌లినాలు తొల‌గి పోయి ముఖం ఫ్రెష్‌గా, గ్లోగా మారుతుంది.అందు వ‌ల్ల‌నే, చాలా మంది రోజుకు క‌నీసం రెండు సార్లు అయినా ఫేస్ వాష్ చేసుకుంటారు.

అయితే ముఖానికి మాత్ర‌మే కాదు.ఫేస్ వాష్‌తో మ‌రిన్ని ఉప‌యోగాలు కూడా ఉన్నాయి.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఉప‌యోగాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

Advertisement

సాధార‌ణంగా ఫుడ్స్ తినేట‌ప్పుడు లేదా టీ, కాఫీ, జ్యూసులు తాగేట‌ప్పుడు పొర‌పాటున బ‌ట్ట‌ల‌పై మ‌ర‌క‌లు ప‌డుతుంటాయి.అవి ఒక్కోసారి పోనే పోవు.అయితే బ‌ట్ట‌ల‌పై మొండి మ‌ర‌క‌ల‌ను వ‌దిలించ‌డంలో ఫేస్ వాష్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

మీరు వాడే ఫేస్ వాష్‌కి కొద్దిగా వంట సోడా మ‌రియు నిమ్మ ర‌సం యాడ్ చేసి ముర‌క‌ల‌పై పోసి ప‌ది నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆపై ఉతికితే ముర‌క‌లు పోతాయి.

అలాగే పాదాలు మురికిగా, న‌ల్ల‌గా ఉన్న‌ట్లు అయితే.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఫేస్ వాష్‌, ఒక స్పూన్ షుగ‌ర్‌, ఒక స్పూన్ తేనె వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాల‌కు ప‌ట్టించి ఐదారు నిమిషాల పాటు స్క్ర‌బ్బింగ్ చేసుకోవాలి.ఇలా చేస్తే పాదాలు తెల్ల‌గా, మృదువుగా మ‌రియు అందంగా మార‌తాయి.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
కేసీఆర్ కవిత సైలెన్స్ .. బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది ? 

ఇక వాహ‌నాల‌ను మెరిపించ‌డంలోనూ ఫేస్ వాష్ ఉప‌యోగ‌ప‌డుతుంది.ఒక గిన్నెలో వాట‌ర్ తీసుకుని అందులో కొద్దిగా ఫేస్ వాష్‌, మ‌రి కొద్దిగా షాంపూ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ నీటితో వాహనాల‌ను తుడిస్తే గ‌నుక‌.

Advertisement

అవి త‌ళ త‌ళ మెరిసి పోతాయి.

తాజా వార్తలు