కొంతమందికి ఎలాంటి చదువు లేకపోయినా ఉన్నతస్థాయికి చేరుకుంటారు.తమలోని టాలెంట్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంటారు.
కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ, ఆవిష్కరణలు చేస్తూ వావ్ అనిపించుకుంటారు.మట్టిలో మాణిక్యాలుగా వీరిని పిలుస్తూ ఉంటారు.
తాజాగా ఒక రైతు( Farmer ) తన ఆవిష్కరణతో శభాష్ అనిపించుకుంటున్నాడు.కరెంట్ లేకపోతే మోటార్ నడవడం కష్టం.
కానీ ఒక వ్యక్తి విద్యుత్ లేకపోయినా నీరు తోడే మోటార్ తయారు చేసి ఔరా అనిపించుకుంటున్నాడు.ఈ పనికి ఇంజనీర్లు సైతం నోరెళ్లబెడుతున్నారు.

బోరు నుంచి నీళ్లు రావాలంటే తప్పనిసరిగా కరెంట్( Electricity ) ఉండాలి.అయితే ఒక రైతు మాత్రం కరెంట్ అవసరం లేకుండా బోరు నుంచి నీళ్లు( Water Pump ) వచ్చేలా వినూత్న ఐడియాను కనిపెట్టాడు.తన ఐడియాతో బోరు నుంచి నీరును బయటకు తోడేస్తున్నాడు.బోరు మోటార్( Bore Motor ) ఎదురుగా ఒక స్టాండ్‌పై మోటార్ తో పాటు ఒక చక్రాన్ని అమర్చారు.
కొద్దిసేపు ఆ చక్రాన్ని వేగంగా తిప్పుతున్నాడు.ఆ తర్వాత బోరు నుంచి వచ్చే నీరు ఎదురుగా ఉన్న మరో చక్రంపై పడి అది కూడా తిరుగుతోంది.
ఈ చక్రం తిరగడం వల్ల అక్కడ కరెంట్ ఉత్పత్తి అవుతుంది.దీని వల్ల మోటార్ తిరుగడం వల్ల బోరు నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి.

రైతు ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారు.కరెంట్ ఉత్పత్తి చేసి బోరు నుంచి నీటిని తీసుకురావడమే కాకుండా పోలంలో లైట్లు కూడా వెలిగిస్తున్నాడు.ఇలాంటి ఐడియాలో అందరూ ఆలోచిస్తే కరెంట్ కోతలు( Power Cuts ) ఉండవని చాలామంది సూచిస్తున్నారు.స్వయంగా కరెంట్ ఉత్పిత్తి చేసుకుంటే కరెంట్ ఛార్జీలు కూడా మిగులుతాయని అంటున్నారు.
అయితే బోరు నుంచి వచ్చే నీటి వేగానికి కరెంట్ తయారవ్వడం కష్టమని కొంతమంది అంటున్నారు.దీనికి శాస్త్రీయత లేదని ఇంజినీర్లు చెబుతున్నారు.







